ఆంధ్రప్రదేశ్‌

సీతంపేట ఎస్‌బిఐలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, డిసెంబర్ 23: శ్రీకాకుళం జిల్లా, ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట భారతీయ స్టేట్ బ్యాంక్‌లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బ్యాంక్ పరిసరాలు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్‌కు శుక్రవారం ఉదయం బ్యాంక్ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించిన స్వీపర్, స్థానికులు బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించడంతో మేనేజర్ ఉదయ్‌కుమార్ సేత్, సిబ్బంది హుటాహుటిన బ్యాంక్‌కు వచ్చి ఆ తరువాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కొత్తూరు సర్కిల్ ఇన్‌చార్జి సిఐ ప్రకాష్, ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు, బ్యాంక్ సిబ్బంది కలిసి బ్యాంక్ లోపల పరిశీలించారు. బ్యాంక్‌లోకి చొరబడిన వ్యక్తులు బ్యాంక్ స్ట్రాంగ్ రూంలోని లాకర్లను తెరిచేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అవి తెరుచుకోకపోవడంతో క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ. 44,820వేల నగదు ఎత్తుకెళ్లారు.