ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిలో 4.8 లక్షల కొత్త రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 23: జనవరి 2నుండి నిర్వహించబోయే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న 4.8 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో చంద్రన్న క్రిస్మస్ కానుక, దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాతతో కలసి మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ జన్మభూమి-మావూరు కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. కొత్త కుటుంబాలు 1.40 లక్షలు, గతంలో కార్డులు రాని కుటుంబాలు 3.40 లక్షలు కలిపి 4.80 లక్షల రేషన్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. దీపం పథకం కింద రాష్ట్రంలో జూన్ 2న నాటికి 24 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ దిశగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ వేగవంతం చేసినట్టు చెప్పారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వాడవాడలా చంద్రన్న సిసి రోడ్ల పథకంలో జిల్లాలో 500 కిలోమీటర్ల సి.సి రోడ్లు నిర్మించామన్నారు. వచ్చే సంతవ్సరం వెయ్యి కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఐటిడిఎ పిఒ సాగిలి షణ్మోహన్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి డి శివశంకర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసులు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, పాల్గొన్నారు.