ఆంధ్రప్రదేశ్‌

28న తిరుమలకు రాష్టప్రతి ప్రణబ్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 23: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ శ్రీవారి దర్శనార్థం ఈనెల 28న ఒక్క రోజు పర్యటనకు తిరుమలకు రానున్నారు. రాష్టప్రతి 28వ తేదీ ఉదయం 9.50 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో బయలుదేరి తిరుచానూరుకు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 11.55 గంటలకు తిరుచానూరులో బయలుదేరి 12.30 గంటలకు తిరుమల శ్రీ పద్మావతి అతిధిగృహం చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పద్మావతి అతిధిగృహం నుంచి బయలుదేరి 1.35గంటలకు రాంభగీచా అతిధిగృహం వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి బ్యాటరీ కారులో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ భూవరాహస్వామిని దర్శిస్తారు. అక్కడ నుంచి బ్యాటరీకారులో 1.45 గంటలకు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా టిటిడి ఆలయ అర్చకులు రాష్టప్రతికి ఇచ్చే ఇస్తీకపాల్ స్వాగతాన్ని స్వీకరించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 1.55 నుంచి 2.20 గంటలకు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని విమాన వేంకటేశ్వరుని ప్రదక్షణగా వెండివాకిలి గుండా ధ్వజస్థంభాన్ని దర్శించుకుని రంగనాయక మండపం చేరుకుంటారు.