ఆంధ్రప్రదేశ్‌

వెలుగుదోన వద్ద టాస్క్ఫోర్స్ సిబ్బందిపై కూలీల రాళ్ళదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 23: తిరుపతి-కడప మార్గమధ్యంలోని వెలుగుదోన వద్ద ఉన్న జ్యోతి కాలనీ సమీప అటవీప్రాంతంలో గురువారం టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులపై ఎర్రకూలీలు రాళ్ళ దాడి చేశారు. దాదాపు 150 మంది కూలీలు తమకు ఎదురుపడ్డ టాస్క్ఫోర్స్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ళవర్షం కురిపించి పోలీసులు తేరుకునేలోగా సంఘటనా స్థలం నుంచి పారిపోయారన్నారు. అయితే సంఘటనాస్థలంలో తనిఖీలు నిర్వహించగా దాదాపు రూ.కోటి విలువచేసే 116 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే ఉస్తికాయలపెంట వద్ద ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బంది కారు, ఆటోల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగల్ని ఆటోతో సహా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పట్టుబడ్డ వారిలో కర్ణాటక రాష్ట్రం మాలూరుకి చెందిన ఒకరు, తమిళనాడు జావాదీ హిల్స్, క్రిష్ణగిరికి చెందిన నలుగురు, ఒక మహిళ ఉన్నారని అన్నారు.