ఆంధ్రప్రదేశ్‌

తాగు నీటి పథకాల నిర్వహణకు టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 23: రాష్ట్రంలోని సామాజిక మంచినీటి పథకాలు (సిడబ్ల్యుఎస్)ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను త్వరలో జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చకు పెట్టనున్నారు. రాష్ట్రంలో 20 నుంచి 30 అవాసాలకు మంచినీరు అందించే సిడబ్ల్యుఎస్‌ల నిర్వహణ తీరు సరిగా లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం వల్ల నిర్వహణలో చాలా లోపాలు ఉంటున్నాయి. ట్యాంక్‌ల నుంచి, పైపులైన్ల నుంచి లీకేజీలు, విద్యుత్ పరికరాలు, కుళాయిల నిర్వహణ సరిగా లేకపోవడంపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా మంచినీటి పథకాలు దాదాపు 670 వరకూ ఉన్నాయి. వీటిని మెరుగుపరిచేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.
వాటి నిర్వహణకయ్యే ఖర్చును ప్రభుత్వ అధికారులు అంచనా వేసి టెండర్లు పిలుస్తారు. టెండర్లను జిల్లాలవారీగా పిలవాలా? లేక రాష్ట్రం ఒక యూనిట్‌గా పిలవాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆయా గ్రామాల నీటి సరఫరాకయ్యే విద్యుత్ చార్జీలను మీటర్ల ద్వారా లెక్కించి పంచాయతీల ద్వారా చెల్లిస్తారు. కొంత ప్రభుత్వం భరిస్తుంది. నీటి సరఫరాకు పంచాయతీలు వసూలు చేసే పన్నును ఆయా పంచాయతీలే వసూలు చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. నీటి సరఫరాలో అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి సరఫరా పథకాలను కూడా డ్వాక్రా మహిళలకు, వివిధ రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఈ రెండు అంశాలపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.