ఆంధ్రప్రదేశ్‌

నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 23: ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ)తో ఆర్థిక రంగంలో సంస్కరణలు చోటుచేసుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన 197వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఫిన్‌టెక్ టవర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల సమయంలో హ్యాకింగ్ సమస్యను అధిగమించేందుకు ఫిన్‌టెక్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో డిజిటలైజేషన్‌పై వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి కన్వీనర్‌గా తాను వ్యవహరిస్తున్నానని, నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ రకాల నమూనాలను పరిశీలించినట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్‌ను వినియోగించి, ఆధార్ ఆధారంతో లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. టెక్నాలజీ సాయంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారదర్శకతతో పాటు లావాదేవీల్లో అక్రమాలు లేకుండా చూస్తున్నామన్నారు. 45 రోజుల నుంచి ఈ పరిస్థితిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆధార్ ఆధారిత యంత్రాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఎటిఎంల వద్ద క్యూల్లో నిలబడి చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీంతో ఏర్పడే ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులతో ఉద్యోగులు స్నేహపూర్వకంగా ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ వినియోగంతో నగదు రహిత లావాదేవీలు చేసేందుకు వీలుగా టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, బ్యాంక్‌లు అందుకు తగినవిధంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తపర్చారు. ఈసందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఆధార్ అనుసంధానంతో నిర్వహిస్తున్న లావాదేవీల్లో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ విధానంతో పనిచేసే ఆధార్ నగదు రహిత విధానాన్ని అనుసరించాలని సూచించారు. 1300 కోట్ల రూపాయల మేర 500 నోట్లను బ్యాంకులకు పంపినట్లు ఆర్‌బిఐ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రానికి 2070 కోట్ల రూపాయలు రానున్నాయని తెలిపారు. జనవరి 1 నాటికి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నగదు రహిత లావాదేవీలను యుద్ధప్రాతిపదికన నిర్వహించుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.