ఆంధ్రప్రదేశ్‌

ఈ నిర్ణయం రైతులకు భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 24: భూ సేకరణ, ఐపి పిటిషన్లు, చిట్‌ఫండ్ వివాదాలు, వక్ఫ్‌ఆస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయదలిచిన ప్రత్యేక కోర్టులు ఆయా కక్షిదారులను ఇబ్బందులకు గురి చేసేవిగా ఉన్నాయని రాష్ట్రంలోని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సహాయం పొందాలన్న ప్రజల ప్రాథమిక హక్కుకు ఇది భంగకరమని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, న్యాయవాదుల డిమాండ్లపై శనివారం కర్నూలులో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన న్యాయవాదులు ఆంధ్రభూమితో మాట్లాడుతూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రాథమిక హక్కుకు భంగం
రైతులు తమకు జరిగిన నష్టాన్ని స్థానికంగా ఉన్న కోర్టుల్లో పరిష్కరించుకోవాలని భావిస్తారు. అలా కాదని సుదూర ప్రాంతాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాథమిక హక్కుకు భంగకరం. ప్రతి రైతుకు వందల ఎకరాల భూమి ఉండదు. సెంటు, రెండు సెంట్ల భూమి కోల్పోయిన రైతులు సైతం ఉంటారన్న విషయం మరువరాదు. చిన్న విషయానికి కూడా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి న్యా యం కోసం పోరాడాల్సిన దు స్థితి కల్పించడం ప్రభుత్వానికి తగదు. ప్రస్తుతం ఉన్నట్లుగానే స్థానిక కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తే కోర్టుకు అవసరమైన సమాచారం ఆలస్యం లేకుండా రెవెన్యూ అధికారులు సమర్పిస్తే సత్వర న్యాయం స్థానికంగా లభిస్తుంది.
- నరసింహారెడ్డి,
రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు

సుదూర న్యాయం
ప్రభుత్వం సత్వర న్యాయం పేరుతో ఏర్పాటు చేసే కోర్టులు ప్రజలకు న్యాయం అం దించే విషయం పక్కనపెడితే వ్యయ ప్రయాసలకు గురి చేయడం ఖాయం. భూ సేకరణ, చిట్‌ఫండ్ వివాదాలు, ఐపి పిటిషన్లలో చిన్న మొత్తాలు రావాల్సిన వారు సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లలేక నష్టపోవాల్సి వస్తుం ది. ఇది వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది.
- ఫణిరత్నం, అధ్యక్షుడు
నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్

ప్రజాగ్రహ నిర్ణయాలు
పారదర్శకత పేరుతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ప్రస్తుత కోర్టులను అవమానించడమే. ఏ కోర్టులోనైనా కేసుల విషయంలో బహిరంగ విచారణ జరుగుతుంది. ఇందులో ఉన్న పారదర్శకతను ప్రశ్నించే అవకాశం ఎవరికీ ఉండదు. భూ సేకరణ కేసుల్లో పారదర్శకత లోపించిందని ఇంతవరకు ఎక్కడా ఆరోపణ రాలేదు. అలాంటపుడు పారదర్శకత ప్రశే్న తలెత్తదు. ఇక సత్వర న్యాయం కావాలంటే ప్రభుత్వం త్వరితంగా కోర్టులకు నివేదికలు అందజేస్తే చాలు.
- శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి
కర్నూలు బార్ అసోసియేషన్

ప్రభుత్వ యోచన
అర్ధం కావడం లేదు
ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. ప్రభుత్వ న్యాయవాదుల నియామకం విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలే గానీ నాలుగైదు జిల్లాకు, రాష్ట్రానికి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే జరుగదు. కోర్టులో వౌళిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం సత్వర న్యాయం గురించి మాట్లాడితే ఎలా?
- సుధాకర్‌రెడ్డి,
సీనియర్ న్యాయవాది