ఆంధ్రప్రదేశ్‌

అదుపుతప్పి ప్రజలపైకి దూసుకెళ్ళిన మినీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 24: తిరుపతి కొర్లగుంట జంక్షన్ వద్ద శనివారం ఉదయం అదుపుతప్పిన మినీ వ్యాన్ ప్రజలపైకి దూసుకెళ్లింది. రోడ్డుపక్కన నడుస్తున్న వారిని ఢీకొనడమేకాకుండా ఓ ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొని విద్యుత్ స్థంబాన్ని ఢీకొని ఆగింది. ఊహించని ఈ సంఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది.
ఏం జరిగిందో అందరికి అర్థమయ్యేలోగానే వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటలో చంద్రారెడ్డి(60) అక్కడికక్కడే మృతి చెందగా, ఒక విద్యార్థి, మరో విద్యార్థినితోపాటుగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులను రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తిరుమల నుంచి కొందరుభక్తులతో ఆర్టీసి బస్టాండ్ వైపు వెడుతున్న మినీవ్యాన్ బ్రేక్ ఫెయిల్‌కావడంతో ఒక్కసారిగా ప్రజలపైకి దూసు కెళ్ళింది. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన వ్యాన్ రోడ్డుపక్కన నడుచుకుంటు వెడుతున్న చంద్రారెడ్డి(60)ని ఢీకొంది. కాగా ఈసంఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన మినీ వ్యాన్‌లోని భక్తులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో డ్రైవర్ సైతం తప్పించుకుని పారిపోయాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా పెద్దపంజాణి మండలంలో కొత్తసంవత్సర వేడుకలు జరుపుకోడానికి స్నేహితులతో కలసి ద్విచక్రవాహనాల్లో వెళ్ళి కొత్తబట్టలు తీసుకుని తిరుగుప్రయాణంలో ఆయిల్‌ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.