ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 24: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించే విధంగా న్యాయమూర్తులు చొరవ చూపాలని, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని హైకోర్టు జడ్జి ప్రవీణ్‌కుమార్ సూచించారు. శనివారం చిత్తూరు జిల్లాకోర్టులో న్యాయమూర్తులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ కేసులు పరిష్కరించడంలో జాప్యం జరిగితే కొన్ని అనర్ధాలు చోటుచేసుకుంటాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా న్యాయమూర్తులు చర్యలు చేపట్టాలని తెలిపారు. చట్టాలపై ప్రజల్లో కూడా అవగాహన రావాలని అప్పుడే కేసులు కొంత త్వరగా పరిష్కారం అయ్యే వీలుంటుందన్నారు. ఈవిషయంలో న్యాయవాదులు కూడా చొరవ చూపితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. దీనివల్ల బాధితులకూ ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేసులు పరిష్కారంలో జాప్యం జరిగితే మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. నిరుపేదలకు ఉచిత న్యాయసేవలు అందేలా అందురు చొరవ చూపాలన్నారు. సంఘటనలను బట్టి నమోదు అయిన కేసులను కొంత లోతుగా వెళ్తేత్వరగా పరిష్కరించే వీలుందన్నారు.