ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక కోర్టులపై సీఎంతో మాట్లాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 24: భూ సేకరణ నష్టపరిహారం కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే విషయంపై మరోమారు సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యాయవాద సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కెయి కృష్ణమూర్తికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కెయి రైతులకు సత్వర న్యాయం జరగాలన్న ఉద్దేశంతో, కోర్టులకు పనిభారం తగ్గించాలన్న ఆలోచనతో భూ సేకరణ నష్టపరిహారం కేసులను పరిష్కరించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఐపి పిటిషన్లు, చిట్‌ఫండ్ వివాదాల పరిష్కారానికి, వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టుల విషయంలో కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని, దీనిపై సీఎంను ఒప్పించగలమన్న ధీమా వ్యక్తం చేశారు.