ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్ర ప్రాంత కార్యవాహ్వ్రి అకాల మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 24: ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రాంత కార్యవాహ (కార్యదర్శి) నముడూరి రవి శనివారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ఆయన గుండెపోటుతో మరణించారు. నముడూరి రవి ఆకస్మిక మృతితో ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. రవి బాల స్వయం సేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లోకి వచ్చి, తర్వాత అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1976 నుండి ఒక దశాబ్ద కాలం పాటు సంఘ్ ప్రచారక్‌గా కూడా పనిచేశారు. ఆ సమయంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంఘ వ్యాప్తికి ఆయన విశేషంగా కృషి చేశారు. ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వివిధ క్షేత్రాల్లో గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. కాకినాడలో న్యాయవాదిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తూ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు. ఈయన ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రాంత కార్యవాహగా 2013లో హిందూ చైతన్య శిబిరం నిర్వహణలో కీలక భూమిక పోషించారు. సంఘ ప్రేరణతో నడుస్తున్న సేవా భారతి, జన సంక్షేమ సమితి వంటి అనేక సేవా సంస్థలను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం నగర శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, బిజెపి నాయకులు, అనుబంధ క్షేత్రాల ప్రతినిధులు తదితరులు రవి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.