ఆంధ్రప్రదేశ్‌

పచ్చచొక్కాలకే రక్షణ కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 24: తెలుగింటి ఆడపడచుల ఆత్మగౌరవం పేరుచెప్పుకుంటున్న టిడిపి పాలనలో సొంత పార్టీ మహిళా సభ్యులకే రక్షణ కరువైందని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కేబినెట్‌లోని ఓక మంత్రి వల్ల తనకు ప్రాణభయం ఉందంటూ గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్ ఆవేదనకు స్పందించి మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రి రావెల కిషోర్ బాబు వల్ల తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ పత్రికలకెక్కడంపై టిడిపి మహిళా నేతలు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. గతంలో కూడా మంత్రి కిషోర్ బాబు తనయుడు హైదరాబాద్‌లో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలున్నాయని గుర్తు చేశారు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నయని అన్నారు. గతంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా అధికారిని వేధించి, భౌతిక దాడులకు దిగిన సందర్భాన్ని గుర్తు చేశారు. టిడిపి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మెడికల్ విద్యార్థిని సంధ్యారాణి, ఇంజనీరింగ్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, విశాఖలో లావణ్య అనుమానాస్పద మృతి వంటి అంశాలను పరిశీలిస్తే టిడిపి ప్రభుత్వ ప పాలనలో మహిళలకు ఏపాటి రక్షణ లభిస్తోందో అర్ధం అవుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను నియంత్రించలేకపోతున్నారని ఆరోపించారు. టిడిపి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు మాత్రం తమ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించడం గానీ, పాల్పడుతున్న వారిపై చర్యల కోసం నిలదీయడం లేదన్నారు. వీరంతా కేవలం తమ సొంత లాభాలను చూసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి పదవీ వ్యామోహం తప్ప మహిళ బాధలు గుర్తుకు రావన్నారు. టిడిపి పాలనలో నవ్యాంధ్ర కాస్తా రాక్షసాంధ్రగా మారిపోయిందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలతో వారి కంట కన్నీళ్లు పారుతున్నాయని, ఈ కన్నీళ్లలో టిడిపి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని రోజా ఆరోపించారు. తాను రాసిన లేఖవల్లే ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారంటూ చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు సమస్య జఠిలం కావడం, సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో తాను ఏమీ చేయలేనంటూ చేతులెత్తేస్తున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టిడిపిలో చేరడం పట్ల స్పందించిన రోజా విలువలకు పాతరేశారని మండిపడ్డారు. ఇటీవల జరిపించిన సర్వేలో టిడిపికి 170 సీట్లు వస్తాయంటూ చంద్రబాబు, అతని పత్రికలు డబ్బాకొట్టుకుంటున్నాయని, అదే నిజమైతే ఎన్నికలు పెట్టి గెలవాలని డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీని టిడిపి ఎన్టీఆర్ భవన్‌గా మార్చేసిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఆపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. విపక్ష సభ్యులను బెదిరించి లొంగదీసుకుంటున్నారని అన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా ఎమ్మెల్యే రోజా