ఆంధ్రప్రదేశ్‌

విథ్యుత్ పొదుపుతో రూ.200 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: విద్యుత్ పొదుపుతో రూ.200 కోట్లు మేర ఆదా చేయగలిగినట్టు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వైస్ చైర్మన్ అజయ్‌జైన్ తెలిపారు. తొలిదశలో ఇప్పటికే ఇంటికి రెండు చొప్పున ఒక కోటీ 85 లక్షలమేర ఎల్‌ఇడి బల్బులను గృహావసరాలకు పంపిణీ చేయడం జరిగిందని, రెండో దశలో మున్సిపల్ వీధి దీపాలను ఎల్‌ఇడిలతో మార్పు చేస్తున్నామన్నారు. పంచాయతీల్లో కూడా ఈ ప్రక్రియ ఆరంభం కానున్నదన్నారు. మూడో దశలో పాతబడిన 2 లక్షల వ్యవసాయ మోటార్ల స్థానంలో తక్షణం విద్యుత్ పొదుపు చేయగల ఫైవ్‌స్టార్ రేటెడ్ పంపుసెట్లను సరఫరా చేయనున్నామని, నాలుగో దశలో విద్యుత్ గృహోపకరణాలను కూడా సరఫరా చేయనున్నామన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ఈనెల 7,8న విజయవాడ నగరంలో ప్రపంచ బ్యాంక్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరుగనున్నదని ఈ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని అజయ్‌జైన్ తెలిపారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 7-8 కోట్లు ఎల్‌ఇడి బల్బుల పంపిణీ జరిగితే ఈ ఒక్క రాష్ట్రంలోనే కోటీ 85 లక్షల మేర పంపిణీ జరిగిందన్నారు. దీనివల్ల గృహ రంగంలో 30 నుంచి 35 శాతం విద్యుత్ ఆదా చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 9 వాట్ల సామర్థ్యం ఉన్న ఎల్‌ఇడి బల్బులను రూ.54కే ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అదనంగా మరో రెండు చొప్పున బల్బులు ఇవ్వనున్నామని దీనిపై సిఎం రేపటి సదస్సులో ఓ ప్రకటన చేయనున్నారన్నారు. గతంలో ఈ బల్బు ధర రూ.310 ఉండగా ప్రస్తుతం రూ.65లకు తగ్గిందన్నారు. ఇతరులకు మార్కెట్ రేటుపై అందచేస్తామన్నారు. 2017 మార్చి నాటికి రాష్ట్ర గృహ, వీధి దీపాల రంగాల్లో ఒక్క సాధారణ బల్బు లేకుండా చేయాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. 30 మున్సిపాల్టీల్లో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటైందని ఈనెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభావేదికపై నుంచి రిమోట్ విధానంలో ప్రారంభిస్తారన్నారు. ఇక కాలం చెల్లిన మోటార్ పంపుసెట్ల స్థానంలో సెల్‌ఫోన్ ద్వారానే ఆన్, ఆఫ్ చేసే ఆధునిక పంపుసెట్లను పంపిణీ చేయనున్నామన్నారు. తొలుత తూ.గో జిల్లాలో పైలట్‌గా ప్రారంభించిన ఈ పథకాన్ని ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు.