ఆంధ్రప్రదేశ్‌

బోర్డువన్నీ తప్పుడు లెక్కలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 24: తుంగభద్ర బోర్డు లెక్కలన్నీ తప్పులతడకలని ఆంధ్రా రైతులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆంధ్రా నీటివాటాలో కోత విధిస్తున్నారని, ఇదే మని ప్రశ్నోంచే నాథుడే లేకపోవడంతో వారు జల చౌర్యానికి అడ్డూఅదుపులేకుండా పోయిందని అంటున్నారు. జలాశయం నీటిని నిబంధనల మేరకు ఆంధ్రాకు విడుదల చేయకుండా కర్నాటకలోని పొలాలు, ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయని వారంటున్నారు. కర్నూలు జిల్లాలోని ఎల్‌ఎల్‌సి కాలువకు వాటా ప్రకారం నీరు విడుదల చేయకుండా నిలిపివేశారంటూ ఆయకట్టు రైతులు బోర్డుపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన కోర్టు తుంగభద్ర జలాల విడుదలపై రికార్డులతో ఈనెల 28వ తేదీ హాజరుకావాలని తుంగభద్ర జలాశయం ఎస్‌ఇని ఆదేశించింది.బోర్డు అధికారులు, రాజకీయ నేతలు కుమ్మకై తుంగభద్ర జలాశయం నీటిని అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకుని ఆంధ్రా రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. స్వయం ప్రతిపత్తి, సర్వాధికారులు కలిగిన తుంగభద్ర బోర్డు అధికారులు నీటి చౌర్యంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం రైతున్నలకు శాపంగా మారింది. ఫలితంగా కర్నూలు జిల్లా రైతులకు కష్టం.. నష్టం మిగిలింది. తుంగభద్ర డ్యాంలో 230 టిఎంసిల నీరు చేరుతుందని అంచనా వేసిన కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌కు నీటి పంపకాలు చేపట్టింది. ఇందులో తుంగభద్ర దిగువ కాలువలో కర్నాటకకు 19 టిఎంసిలు, ఆంధ్రాకు 24 టిఎంసిలు, తుంగభద్ర హైలెవల్ కెనాల్‌లో కర్నాటకకు 17.50, ఆంధ్రాకు 32.50 టిఎంసిల నీటిని కేటాయించారు. కర్నాటకలోని ఎడమ కాలువ లోలెవల్, హైలెవల్ కాలువలకు 93 టిఎంసిలు, రాయబసవ కెనాల్‌కు 7 టిఎంసిలు, విజయనగర్ ఛానల్‌కు 2 టిఎంసిలు, రాజోలిబండ పథకంలో కర్నాటకకు 0.49 టిఎంసిలు, ఆంధ్రాకు 6.50 టిఎంసిలు కేటాయించారు. అలాగే కర్నూలు, కడప (కెసి కెనాల్‌కు) 10 టిఎంసిలు, మొత్తం కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలకు కలిపి 212 టిఎంసిల నీటిని కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించింది. 18 టిఎంసిలు డ్యాం లాస్ కింద చూపిస్తున్నారు. ఈ కేటాయింపులన్నీ వర్షాలు సమృద్ధిగా కురిసి డ్యాం నిండి రెండు, మూడు సార్లు పరవళ్ళు తొక్కితేనే అమలులోకి వస్తాయి. వర్షాలు రాకుండా డ్యాం నిండకపోతే డ్యాంలో ఉన్న నీటిలో కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన నీటి నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాల్సి ఉంటుంది. తుంగభద్ర బోర్డు ఉన్నా కర్నాటక రాష్ట్రం యథేచ్ఛగా గత కొనే్నళ్లుగా జలదోపిడీకి పాల్పడుతోంది. కాలువకు ఒకవైపే పంటలు పండించాల్సి ఉన్నా మెయిన్ కెనాల్‌కు గండి కొట్టి రెండువైపుల కర్నాటక ప్రాంతంలో విచ్చలవిడిగా పంటలు వేసుకున్న రైతులకు నీరందిస్తూ మన రాష్ట్ర వాటాకు భారీ గండికొడుతోంది. తుంగభద్ర జలాశయం కర్నాటకలో ఉండడటంతో నదీపరివాహక ప్రాంతంలో 120కు పైగా చిన్న, మధ్యతరహా ఎత్తిపోతల పథకాలను కర్నాటక నిర్మించి 6 టిఎంసిల నీటిని అక్రమంగా వాడుకుంటోంది. కర్నాటకలోని దరోజీ ట్యాంకులో ఒక టిఎంసి నీరు నిలువ చేసుకుంది. గంగావతి, దరోజి, సిగ్నల్ కొట్టాల, శిరుగుప్ప, కెంచనగూడ, మాన్వి తదితర గ్రామాల్లో లక్షల ఎకరాల అక్రమ ఆయకట్టు సాగు అవుతోంది. కృష్ణా ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం ఈ ప్రాంతాలకు నీటి సరఫరా లేదు. రాయచూరు కెనాల్ నుంచి అక్రమంగా నీటిని మళ్లించి మల్లాపూర్, శివపూర్, తిరుమలపూర్, శక్తినగర్ ప్రాంతాల్లో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లకు వాడుకుంటున్నారు. బళ్ళారి సమీపంలో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీకి వాస్తవంగా కర్నాటక కాలువల నుంచి నీరు సరఫరా చేయాలి. గతంలో ఏడాది పొడవునా నీటి సరఫరా ఉండే రాయబసవ కెనాల్ నుంచి జిందాల్ ఫ్యాక్టరీకి నీటిని సరఫరా చేశారు. అయితే దీనికి కర్నాటక రైతులు అభ్యంతరం తెలపడంతో తుంగభద్ర దిగువ కాలువ, ఎగువ కాలువ జీరో పాయింట్ నుంచి నీటి సరఫరాకు బోర్డు అధికారులు పూనుకున్నారు. దీనిపై అప్పట్లోనే ఆంధ్రా రైతులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు, నాయకులను జిందాల్ యాజమాన్యం నోట్లతో ప్రసన్నం చేసుకోవడంతో జీరో పాయింట్ నుంచి జిందాల్‌కు నీటి సరఫరాకు ఎలాంటి అడ్డంకులు లేకుండాపోయాయి. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. జీరో పాయింట్ అని బుకాయిస్తున్నప్పటికీ ఆంధ్రా రాష్ట్ర వాటా నుంచే నీటిని జిందాల్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇది అక్షర సత్యం. అలాగే మునీరాబాద్‌లోని పరిశ్రమలకే 34 క్యూసెక్కుల నీరు అవసరం. ఈనీటిని కూడా తుంగభద్ర డ్యాం నుంచే అక్రమంగా మళ్లిస్తున్నారు. బళ్ళారి జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీలకు కూడా తుంగభద్ర జలాల నుంచే అక్రమంగా నీటిని మళ్లిస్తున్నారు. ఆ లెక్కలన్నీ డ్యాంలో నీటి ఆవిరి కింద, బ్యాక్‌వాటర్ కింద, మైనస్ ఇన్‌ఫ్లో కింద తప్పుడు లెక్కలుగా చూపిస్తున్నారు. ఇక్కడే కర్నాటక తుంగభద్ర జలాల్లో రాష్ట్ర నీటికి భారీ గండి కొడుతోంది. కరవు ప్రాంతమైన కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ సాగు, తాగునీటిని ప్రధానమైంది.