ఆంధ్రప్రదేశ్‌

త్రిశంకు స్వర్గంలో ప్రత్యేక టిటిసి అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 24: ప్రైవేటు టిటిసిల ద్వారా ప్రత్యేక క్రాష్‌కోర్సు పూర్తి చేసిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదేశాలను కూడా ప్రాథమిక విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు భేఖాతరు చేస్తున్నారు. న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఎపిలోని విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి న్యాయం జరగలేదు. వీరిలో వేలాది మంది అభ్యర్థుల వయస్సు మీదపడడంతో వివిధ వృత్తులతో జీవనం సాగిస్తున్నారు. తమకు అసలు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతీ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పోటీ పడే ఎపిలోని తెలుగుదేశం ప్రభుత్వం వారికి న్యాయం చేయడంలో జాప్యం చేస్తోంది. అదే కోర్సులు పూర్తి చేసిన 34 మందికి తెలంగాణా ప్రభుత్వం 2014లోనే ఎస్‌జిటిలుగా ఉద్యోగాలు కల్పించింది. 1982-83 సంవత్సరం వరకు ప్రైవేటు సంస్థల నిర్వహణలోని టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి.
1983-84, 1984-85 సంవత్సరాల్లో సుమారు 35వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణా కోర్సుల ద్వారా శిక్షణ పొందారు. అయితే ఆనాటి ప్రభుత్వం ప్రైవేటు టిటిసి కోర్సులపై నిషేధం విధించడంతో వారి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నాటి నుంచి నేటి వరకు వారికి న్యాయం జరగలేదు. నాడు శిక్షణ పొందిన అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 7500 మంది అభ్యర్థులను అర్హులుగా గుర్తించి 1995లో క్రాష్‌కోర్సు ద్వారా డైట్లలో మరోసారి శిక్షణ పొందేందుకు అవకాశం కల్పించారు.
3 బ్యాచ్‌లు వారీగా వీరికి శిక్షణ ఇచ్చారు. క్రాష్‌కోర్సు ద్వారా శిక్షణ పొందిన వారికి ఒకసారి డిఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించలేదు. దీంతో 2011లో అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో 2013లో ట్రిబ్యునల్ ఎనిమిది వారాల్లోగా అభ్యర్థుల భవితవ్యంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మొత్తం ఉభయ రాష్ట్రాలకు చెందిన 65 మంది అభ్యర్థుల భవిష్యత్ ప్రస్తుతం ప్రాథమిక విద్యాశాఖ అధికారుల చేతుల్లో ఉంది. వీరిలో 11 మంది తెలంగాణకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా తమకు తగిన న్యాయం చేయాలని క్రాష్‌కోర్సు టిటిసి అభ్యర్థులు ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 1998 డిఎస్సీ అభ్యర్థుల అంశంపై పరిశీలన జరపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో క్రాష్‌కోర్సు అభ్యర్థుల్లో కూడా ప్రస్తుతం ఆశలు రేకెత్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.