ఆంధ్రప్రదేశ్‌

3 ఎమ్మెల్సీ స్థానాలూ గెలుచుకుందాం: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 24: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకుందామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ ఎత్తుగడలు, వ్యూహాలను తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో శనివారం నాయకులు, కార్యకర్తలతో జగన్ మాట్లాడుతూ జిల్లాలోని నగరపాలక సంస్థ , పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లు వైకాపా వారే అధికంగా ఉన్నారని, జడ్పీటీసీలులు, ఎంపిటిసిల్లో మెజారిటీ మనదేనన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలాలన్నారు. పశ్చిమ రాయలసీమ జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గోపాల్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేస్తున్న కత్తి నరసింహారెడ్డిని సైతం గెలిపించుకోవాలన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా నిరుద్యోగులు ఎవరికీ జాబు రాలేదన్నారు. టిడిపి ప్రభ్వుంపై వ్యతిరేకత వస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పులివెందుకుల నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.