ఆంధ్రప్రదేశ్‌

ఎర్రగుంట్ల- నంద్యాల డెమో రైలుకు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రగుంట్ల/ప్రొద్దుటూరు రూరల్, డిసెంబర్ 24: నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు వస్తున్న డెమో రైలుకు శనివారం పెనుప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి శనివారం ఉదయం బయలుదేరిన డెమో రైలు(నెం.77401) ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ దాటి ఎర్రగుంట్ల వస్తుండగా మార్గమధ్యంలో మాలేపాడు బ్రిడ్జివద్ద 114.6 కిమీ సమీపంలో రైలు పట్టా విరిగిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై నిలిపివేశారు. రైలు దెబ్బతిన్న పట్టామీదుగా వెళ్తున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని గ్రహించిన డ్రైవర్ గార్డును అలర్ట్‌చేసి బండిని నిలిపివేశాడు. ఇద్దరూ కిందికి దిగి చూడగా పట్టా విరిగిపోయి కనిపించింది. వెంటనే అటు గుంతకల్లు, ఇటు నంద్యాల రైల్వే ఉన్నతాధికారులకు వారు సమాచారం అందించారు. రైల్లే రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రైలును ఎర్రగుంట్లకు తీసుకొచ్చారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే రైలుకు పెనుప్రమాదం తప్పింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అపారనష్టం సంభవించేది. పట్టాకు మరమ్మతులు చేసిన అనంతరం గంట ఆలస్యంగా డెమో రైలు ఎర్రగుంట్ల మీదుగా కడపకు బయలుదేరింది. తిరిగి సాయంత్రం నంద్యాలకు చేరుకుంది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

చిత్రం..విరిగిన రైలు పట్టా