ఆంధ్రప్రదేశ్‌

సునామీకి పనె్నండేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 26: సుమత్ర దీవుల్లో సంభవించిన భారీ భూకంపం ప్రభావంతో మన తీర ప్రాంతంలో సునామీ సంభవించి ప్రకాశం జిల్లాలోని కోస్తా తీరప్రాంత ప్రజల జీవన బతుకులను చిధ్రం చేసింది. 2004 డిసెంబర్ 26వ తేదీ ఉదయానే్న సునామీ సంభవించింది. సునామీ సంభవించి నేటికి 12సంవత్సరాలు పూర్తయింది. అప్పటినుండి సునామీ హెచ్చరికలను జారీచేస్తే చాలు కోస్తా తీరప్రాంతంలోని మత్స్యకారులతోపాటు, ఇతర వర్గాలు తీవ్ర భయాందోళనకు గురౌతునే ఉంటారు. ఏ చిన్న హెచ్చరిక జారీఅయినా చిగురుటాకుల్లా వణికిపోతుంటారు. తుపాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలను లెక్కచేయని మత్స్యకారులకు సునామీ మాత్రం వారి గుండెల్లో రైళ్ళు పరిగెట్టించింది. ఆనాటి రాకాసి అలలు 15 అడుగుల ఎత్తులోవచ్చి కొంతమంది మత్స్యకారులను, పడవులు, తెప్పలు, వలలను తన గర్భంలోకి తీసుకువెళ్ళింది. ఆ అలలను చూసిన మత్స్యకారులు ఇప్పటికి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. సముద్రపు అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తున్న లేచిన సందర్భాలు చాలా తక్కువని అలాంటి సునామీ అలలు తమ జీవన ఆర్థిక పరిస్ధితులే మార్చివేసిందని మత్స్యకారులు ఆందోళన చెందారు. కాగా సముద్రం లోతున వేటాడే మత్స్యకారులకు సునామీ వచ్చిందని తెలియదు. కేవలం బయట ఉన్న మత్స్యకారులు, సముద్రపు అంచున ఉన్న మత్స్యకారులకు మాత్రం రాకాసి అలలు స్పష్టంగా కనిపించటంతో పరుగులు పెట్టారు. సముద్రంలోపల ఉన్నవారు బయటకు వచ్చిన తరువాత కాని సునామీ తీవ్రత తెలియరాలేదని కొంతమంది మత్స్యకారులు ఆ రోజుల్లో చెప్పుకొచ్చారు.
సునామీతో జిల్లాలోని 10 మత్స్యకార మండలాల్లోని 72 గ్రామాల మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఉదయానే్న సాధారణంగా ఉన్న సముద్రం, దానిపక్కనే ఉన్న కాల్వల్లోకి రాకాసి అలలు ఒక్క ఉదుటన లేచిపడటంతో మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు కట్టుబట్టలతో పరుగులు తీశారు.
కోట్లాది రూపాయల విలువైన వలలు, తెప్పలు, బోట్లు దెబ్బతినటంతో మత్స్యకారులు కొన్ని సంవత్సరాలపాటు కొలుకోలేకపోవటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఇతోధికంగా ఆదుకున్నాయి. సునామీరాక ముందు సముద్రంలో 30 రకాల చేపలు దొరికేవని ప్రస్తుతం కేవలం పది రకాల చేపలు మాత్రమే దొరుకుతున్నాయని జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరక్టర్ లాల్ మహమ్మద్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. సునామీ నేపథ్యంలో కోస్తాతీరప్రాంతంలో భూగర్భజలాలు సైతం ఉప్పునీటి మయంగా మారటంతో కొన్ని సంవత్సరాలపాటు ప్రజలు మంచినీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సునామీ రాకముందు కోస్తా తీరప్రాంతంలోని భూములు సైతం భారీగా ఉండేవి. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపట్నం బీచ్ వద్ద సునామీ రాకముందు ఎకరా 70 నుండి 80 లక్షల రూపాయల వరకు పలకగా సునామీ వచ్చిన తరువాత ఆ భూములను అడిగే నాథుడే కరవయ్యారు. ఇప్పటికి తీరప్రాంతంలో భూములను కొనుగోలు చేసేందుకు పారిశ్రామికవేత్తలు కాని, రియల్టర్లు కాని వెనకంజవేస్తూనే ఉన్నారు. మొత్తంమీద సునామీతో కోస్తా తీరప్రాంతం అన్ని రకాలుగా దెబ్బతిందనే చెప్పవచ్చు.

చిత్రం..చెన్నై తీరంలో సోమవారం సముద్రుడుకి పూజలు చేస్తున్న మహిళలు