ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి సాయం గొప్ప ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 26: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,981 కోట్ల నాబార్డు రుణం చెక్కును కేంద్రం నుంచి అందుకోవడం నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో గొప్ప ముందడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. సోమవారం తన నివాసం నుంచి కలెక్టర్లు, ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులు, బ్యాంకర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులను ముమ్మరం చేశామని, భారీ యంత్రాలను వినియోగించి ప్రతిరోజూ రెండున్నర లక్షలు, 3 లక్షల క్యూ.మీ.ల మట్టిని తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిధులతో కాపర్ డ్యామ్ పనులు, డయాఫ్రాం వాల్ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటాయన్నారు. 2018కల్లా ప్రాజెక్టును పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర సత్వర ఆర్థికాభివృద్ధి కోసమే ప్యాకేజీకి అంగీకరించామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పోలవరం పనులకు నిధుల కొరత లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని కోరారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రజాసాధికారత సాధించాలని దిశానిర్దేశం చేశారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం సూత్రాలు విధిగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన 18 సస్టయినబుల్ డెవలప్‌మెంట్, 20 నాన్ నెగోషియల్ గోల్స్ సాధించాలని చంద్రబాబు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, ప్రణాళికా శాఖ అధికారులు సంజయ్ గుప్తా, శాంతిప్రియ పాండే, పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, సిఎంవో సంయుక్త కార్యదర్శి రాజవౌళి పాల్గొన్నారు.