ఆంధ్రప్రదేశ్‌

క్యారమ్స్ మారథాన్‌లో సమీర, పావన్ రికార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 26: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి తెలుగుతేజాలు హుస్నా సమీరా, అల్లాడ పావన్ నిదర్శనంగా నిలిచారు. క్యారమ్స్‌లో సోమవారం వీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్యారమ్స్ మారథాన్ సోమవారం సాయంత్రంతో ముగిసింది. 34 గంటల 45 నిమిషాల 56 సెకన్ల పాటు నిర్విరామంగా క్యారమ్స్ ఆడిన వీరిద్దరూ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇప్పటికే హుస్నా సమీరా ఖాతాలో లిమ్కా బుక్ రికార్డ్‌లు రెండున్నాయి. 2014లో 18 గంటల 18 నిమిషాల 18 సెకన్ల రికార్డ్, 2015లో 20 గంటల 20 నిమిషాల 20 సెకన్ల రికార్డ్ ఉండగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఆమె పావన్‌తో కలిసి నమోదు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి జయసింహ ఇక్కడ మారథాన్ క్యారమ్స్‌లో హుస్నా సమీరా, పావన్‌ల జోడి రికార్డ్ నెలకొల్పినట్లు ప్రకటించారు. అనంతరం రికార్డ్ సాధించిన క్రీడాకారులను మేయర్ కోనేరు శ్రీధర్, శాసనమండలి సభ్యుడు బుద్ధా వెంకన్న ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకుడు జి రామకృష్ణప్రసాద్, జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె పట్ట్భారామ్, ఎ పాండురంగారావు, రాష్ట్ర సంఘ కోశాధికారి పద్మనాభం, శాప్ అధికారులు పాల్గొని వారిని అభినందించారు.

చిత్రం..క్యారమ్స్ మారథాన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన
సమీరా, పావన్‌లను గజమాలలతో సత్కరిస్తున్న ప్రముఖులు