ఆంధ్రప్రదేశ్‌

కోడి పందాలు అనుమతించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: సంక్రాంతికి కోడి పందాలను అనుమతించవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కోడి పందాలు జరగకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, కమిషనర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , జస్టిస్ ఎ శంకరనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు రెండింటిని విచారిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చారు. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించకుండా నిరోధించేందుకు కమిటీలను నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఫిబ్రవరి 6 నాటికి కోర్టు ఆదేశాలపై తీసుకున్న చర్యల నివేదికలను న్యాయస్థానం ముందుంచాలని కూడా ఆదేశించారు.
హైకోర్టుకు దిల్‌సుఖ్‌నగర్ దోషులు
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసుల్లో ఉరిశిక్ష పడిన ముద్దాయిలు ఎన్‌ఐఎ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. ఐఎం అనుబంధ వ్యక్తులుగా తమను నిర్ధారించకుండానే శిక్ష పడిందని వారు పేర్కొన్నారు. ఎన్‌ఐఎ కోర్టు బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించడం తెలిసిందే.