ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌అండ్‌బి ఇంజనీర్ అక్రమాస్తులు రూ. 60కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడిన ఆర్ అండ్ బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుభాష్‌చంద్ర పాత్రో అక్రమ సంపాదన రూ.60 కోట్లకు చేరుకుంది. రెండు రోజుల కిందట పాత్రోసహా అతని బంధువుల ఇంట్లో ఎసిబి ఏకకాలంలో సోదాలు నిర్వహించగా రూ.4.8 కోట్ల మేర ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.50 కోట్లుగా ఎసిబి అంచనావేసింది. అవినీతి అధికారి పాత్రోకు సంబంధించిన విశాలాక్షినగర్ ఆంధ్రాబ్యాంకు శాఖ లాకర్‌ను ఎసిబి అధికారులు సోమవారం తెరిచారు. ఈ లాకర్‌లో అడవివరంలో 300 చదరపు గజాల నివేశన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్‌లు, 180 గ్రాముల బంగారు, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.6.5 లక్షల నగదు గల బ్యాంకు పాసుపుస్తకాలు, రూ.21 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించి రూ.8 లక్షలు చెల్లించినట్టు రశీదులు, 6 ఖాళీ ప్రామిసరీ నోట్లు, మరో 4 బ్లాంక్ చెక్కులు లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాత్రో అక్రమాస్తులు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం రూ.60 కోట్లుగా ఎసిబి అధికారులు అంచనావేస్తున్నారు. అవినీతి అధికారి పాత్రోను ఆదివారం ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.

చిత్రం..పాత్రో లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు