ఆంధ్రప్రదేశ్‌

హరించుకుపోతున్న కమిషన్ గడువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 26: గోదావరి నది మహా పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య విచారణ కమిషన్ గడువు హరించుకుపోతోంది. ఇప్పటికే ఐదుసార్లు కమిషన్ గడువు పొడిగించినప్పటికీ విచారణ కొలిక్కి రాలేదు. ఐదవసారి విచారణ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ ఇప్పటికీ విచారణ మొదలు కాలేదు. పొడిగించినప్పటికీ సరైనా సమాచారాన్ని అందించడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కమిషన్ విలువైన కాలం వృథా అవుతోంది. గోదావరి మహా పుష్కరాల్లో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సివై సోమయాజులు కమిషన్ విచారణ గడువు జనవరి 29వ తేదీతో ముగియనుంది. గత అక్టోబర్ చివరి వారంలో పెంచిన గడువు నాలుగు మాసాల్లో ఇప్పటికి ఒకసారి కూడా కమిషన్ విచారణ జరగలేదు. 2015 జూలై 14న సంభవించిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం మొదట సెప్టెంబర్ 15న జస్టిస్ సివై సోమయాజులు కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ గడువు గత మార్చి 30వ తేదీతో పూర్తయింది. అనంతరం మళ్ళీ జూన్ 30కి గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ గడువులోగా కూడా విచారణ కొలిక్కి రాకపోవడంతో ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు గడువు పెంచారు. ఈ గడువులోగా కూడా విచారణ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 25న జీవో నెంబర్ 390 ప్రకారం గడువు పెంచారు. ఇప్పటికి ఐదవ సారి గడువు పెంచుతూ జీవో ఇచ్చారు. ఈ గడువు కాస్తా జనవరి 29వ తేదీతో ముగియనుంది. ఇన్ని సార్లు గడువు పెంచినప్పటికీ కమిషన్ ముందు సరైన సాక్ష్యాధారాలు, అవసరమైన సమాచారం, డాక్యుమెంట్లు అందించడంలో యంత్రాంగం సక్రమంగా వ్యవహరించకపోవడంతోనే విచారణ గడువు పెంచాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాదిపాటు సాక్ష్యాధారాలు సమర్పించడంతోనే నెట్టుకొచ్చింది. విచారణకు విచారణకు మధ్య గతించిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గడువు పొడిగిస్తోంది. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో విచారణ గడువు పొడిగించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం అనేక సార్లు విచారణ గడువు పెంచామని లాజిక్ ప్రదర్శిస్తోంది. ఎన్నిసార్లు విచారణ గడువు పెంచినప్పటికీ పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఒకసారి గడువు పెంచుతూ జీవో విడుదలయ్యే సమయానికే దాదాపు నెల రోజులపాటు కాలం హరించుకుపోతోంది. ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకు ఉన్న విచారణ గడువులో ఇప్పటికే దాదాపు మూడు నెలల కాలం వృథా అయింది. ఇప్పటికే ఐదు సార్లు గడువు పెంచినా గడువుకూ గడువుకూ మధ్య ఆరు నెలల వ్యవధి వృథా అయింది. ప్రస్తుత విచారణకు కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల రోజుల్లోనైనా విచారణ జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కమిషన్ ఎనిమిది సార్లు విచారణ నిర్వహించింది. దోషులను తేల్చడంలో చిత్తశుద్ధి లేదు. ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బాధితుల తరపు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.