ఆంధ్రప్రదేశ్‌

నగదు రహిత లావాదేవీలకు విశేష ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: నగదు రహిత లావాదేవీలపట్ల అవగాహన కల్పించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఆన్‌లైన్‌లో బిల్ డెస్క్ గేట్ వే ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసిఎల్) సోమవారం ప్రోత్సాహక బహుమతులు అందజేసింది. విశాఖ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ చేతుల మీదుగా బిల్‌డెస్క్ ద్వారా ఎంపికైన వారికి సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. నగదు రహిత విద్యుత్ బిల్లు చెల్లింపు విధానాలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన వినియోగదారులు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉన్నారు. విజె ప్రభుదాస్ (రణస్థలం, విజయనగరం), ఎ.చందు (జలుమూరు), ఎస్.రామారావు (టెక్కలి, శ్రీకాకుళం), ఎస్.రామారావు (బాడంగి, విజయనగరం), బి.అన్నపూర్ణ (బలిజిపేట) వినియోగదారులు ఈ బహుమతులు అందుకున్నారు. కాగా పెద్దనోట్ల రద్దు తరువాత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రోజు నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు నగదు రహిత లావాదేవీల ద్వారానే జరుగుతుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ ప్రథమస్థానంలో నిలిచింది. వినియోగదారులకు ప్రోత్సాహకాలు అందివ్వడంలో కూడా ఇదే నిలువగలిగింది.

చిత్రం..నగదు రహిత విద్యుత్ బిల్లు చెల్లించిన వినియోగదారుడికి
ప్రోత్సాహకాన్ని అందజేస్తున్న ఈపిడిసిఎల్ సిఎండి నాయక్