ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.జిల్లా విద్యాశాఖాధికారి సస్పెన్షన్‌కు తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 27: ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్య వైఖరి, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తోన్న తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ నరసింహరావును సస్పెన్షన్ చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశం తీర్మానించి ఆమోదించింది. సమావేశంలో డిఇఒ వైఖరి పట్ల పలువురు జడ్పీ సభ్యులు, అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాలులో మంగళవారం జడ్పీ సర్వసభ్య బడ్జెట్ సమావేశం జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 55 లక్షల మిగులుతో 2017-18 ఆర్ధిక సంవత్సరానికి 22 కోట్ల 8లక్షల బడ్జెట్ అంచనాను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వివిధ అంశాలపై అధికారుల తీరుకు జడ్పీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో జిల్లాలోని ఏజెన్సీ గంగవరం మండలం లక్కొండ ఎలిమెంటరీ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడి డిప్యుటేషన్ రద్దు అంశంపై ఎంపిపి తీగల ప్రభ, డిఇఒను వివరణ అడిగారు. లక్కొండలోని ఒక ఎయిడెడ్ స్కూల్‌ను ఐటిడిఎ స్కూల్‌లో విలీనం చేశారని, తగిన సంఖ్యలో విద్యార్థులు లేరన్న సాకుతో పాఠశాలను తొలగించారంటూ ప్రభ నిరసన తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి వివరణ ఇస్తూ ఆ ఎయిడెడ్ స్కూల్ కరస్పాండెంట్‌కు, టీచర్‌కు మధ్య వివాదం ఏర్పడిందని, ఆ స్కూల్‌ను కలెక్టర్ అనుమతితోనే మూసివేశామని వివరణ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఆ టీచర్ కూడా ఇక్కడి సభ్యుల మాదిరిగానే వచ్చి ఏడ్చాడని వ్యాఖ్యానించారు. డిఇఒ ఇచ్చిన ఈ అనుచిత సమాధానానికి విస్మయానికి గురైన ప్రజాప్రతినిధులు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేసిన డిఇఒపై సస్పెన్షన్ కోసం తీర్మానం చేయాలని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులంటే డిఇఒకు తొలి నుండీ వెటకారంగా మారిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు వేగుళ్ళ జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు డిఇఒను సంజాయిషీ కోరి, ఆయనపై చర్యకు విద్యాశాఖ డైరెక్టర్‌ను కోరతామని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సభ్యులు డిఇఒ వ్యవహార శైలిని ఖండిస్తూ సస్పెన్షన్‌కు పట్టుపట్టారు. దీంతో డిఇఒ సస్పెన్షన్‌ను సభ తీర్మానించి, ఆమోదం తెలియజేసింది.