ఆంధ్రప్రదేశ్‌

సిఎం పర్యటనకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 27: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభించడానికి ఈ నెల 30న వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోపాటు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను డిజిపి సాంబశివరావు, డిఐజి రామకృష్ణారావు, ఎస్పీ భాస్కర్ భూషణ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ భారీ బహిరంగ సభ జరుగుతున్న ప్రదేశం చుట్టూ కొండల ప్రదేశం కావునా ఈ ప్రాంతాన్ని గ్రేహాండ్స్ బలగాలు తమ ఆధీనంలో ఉంచుకుని విస్తృత భారీ బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో రెండు ప్లాటూన్ల ఎపిఎస్పీ పోలీసులు ఉన్నారని, అదనంగా మరో ప్లాటూన్‌ను రప్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వందలాది బస్సుల్లో ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారన్నారు. వివిధ జిల్లాల నుండి బస్సులు పోలవరం వచ్చేందుకు మూడు రూట్లను గుర్తించినట్టు చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చే బస్సులు కొవ్వూరు, తాళ్లపూడి మీదుగా పోలవరం చేరుకుంటాయన్నారు. ఏలూరు వైపునుండి వచ్చే మిగతా జిల్లాల బస్సులు జంగారెడ్డిగూడెం, కన్నాపురం మీదుగా పోలవరం, మరికొన్ని నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి మీదుగా పోలవరం చేరుకుంటాయని ఆయన తెలిపారు. ఎవరికీ ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు చేస్తున్నట్టు చెప్పారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న డిజిపి సాంబశివరావు ప్రాజెక్టు కొండపై ఉన్న హెలిప్యాడ్, అలాగే తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న హెలిప్యాడ్లను పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు కొన్ని ఏర్పాట్లను డిజిపి సాంబశివరావు ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు సూచించారు. అలాగే బహిరంగ సభకు వచ్చే ప్రజలతో కఠినంగా వ్యవహరించవద్దని డిఎస్పీలకు సూచించారు. ఈయన వెంట డిఎస్పీలు జె వెంకట్రావు, హరికుమార్, మురళీకృష్ణ, పకీరప్ప, పోలవరం సిఐ బాలరాజు ఉన్నారు.