ఆంధ్రప్రదేశ్‌

రంగా విగ్రహం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 3: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం గుర్తుతెలియని దుండగులు కాపు సామాజికవర్గం నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. పట్టణ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రేవతి సెంటరులోని రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కొద్దిసేపు ధర్నా జరిపారు. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అల్లర్లకు తావులేకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
రంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ, రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఖండించారు. ముగ్గురు నేతలు వేర్వేరుగా ఘటనా స్థలిని పరిశీలించి సంఘటనపై ఆరా తీశారు.

చిత్రం... దుండగుల చేతిలో ధ్వంసమైన రంగా విగ్రహం