ఆంధ్రప్రదేశ్‌

అక్రమంగా తరలిస్తున్న 13లక్షలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, డిసెంబర్ 27: అక్రమంగా తరలిస్తున్న 13 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో ఒక వ్యక్తిని సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం గాజువాకలో అరెస్టు చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి శివారు నర్సింగరావుపేట ప్రాంతానికి చెందిన కె.నాగ ఈశ్వర బాల వీరాంజనేయ ఆచారి మంగళవారం తన హోండా యాక్టివా స్కూటీలో 577 కొత్త రెండు వేల రూపాయల నోట్లు, 1432 వంద రూపాయల నోట్లు, 56 ఏబై రూపాయల నోట్లను తీసుకు వస్తుండగా సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు గాజువాక ఆర్‌కె ఆసుపత్రి కూడలిలో అతడ్ని పట్టుకున్నారు. అనకాపల్లి నుండి విశాఖపట్నానికి సుమారు 13లక్షల రూపాయలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆచారిని అదుపులోకి తీసుకున్నారు. ఆచారిని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం గాజువాక పోలీసులకు కేసును అప్పగించి కరెన్సీని సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ముఠా కోసం అనే్వషణ
ఇదిలా ఉండగా పాత కరెన్సీని మారుస్తామని ఒక వ్యక్తిని నమ్మించి 17 లక్షల కొత్త కరెన్సీతో ఉడాయించిన ముఠా కోసం గాజువాక పోలీసులు అనే్వషిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు వివరాల ప్రకారం విశాఖ జిల్లా మునగపాక మండలం అరుబుపాలెం గ్రామానికి చెందిన లోవరాజు నాగేశ్వరరావు అనే వ్యక్తికి గాజువాక ప్రాంతానికి చెందిన ఒక ముఠా పది రోజుల క్రితం 20 లక్షల పాత కరెన్సీ తమ వద్ద ఉందని, వీటిని తీసుకుని 17 లక్షల కొత్త కరెన్సీ ఇవ్వాలని ఫోన్ చేశారు. దీంతో నాగేశ్వరరావు పదిరోజుల క్రితం తనతో పాటు మరో నలుగురిని తీసుకుని ఆ ముఠా చెప్పిన అడ్రస్‌కు వచ్చి ముఠా సభ్యులకు ఫోన్ చేయగా సమతానగర్‌లో ఉన్న ఒక ఇంటి వద్దకు రమ్మన్నారు. దీంతో నాగేశ్వరరావు ఒక్కరే సమతానగర్‌కు వెళ్లాడు. అయితే ఆ ముఠా నాగేశ్వరరావును బెదిరించి కొత్త కరెన్సీ ఎక్కడని ప్రశ్నించారు. దీంతో కరెన్సీ నోట్లతో గాజువాక జగ్గు కూడలిలో ఉన్న మిగిలిన వ్యక్తుల వద్దకు ముఠా మొత్తం వచ్చిందని, ఆ తరువాత కొత్త కరెన్సీ నోట్లతో ఉన్న నలుగురు వ్యక్తులపై దాడి చేసి వారి వద్ద ఉన్న 17 లక్షల రూపాయలతో ముఠా ఉడాయించినట్లు పోలీసుల సమాచారం. అయితే బాధితులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తిరిగి మునగపాక వెళ్లిపోయారు. ఈ విషయం ఇటీవల గాజువాక ఎసిపి జి.రామ్మోహన్‌రావుదృష్టికి వచ్చింది. వెంటనే ఎసిపి రంగంలో దిగి కూపీ లాగారు. ఎసిపి ఈ కేసును క్రైం విభాగానికి అప్పగించగా రంగంలో దిగిన పోలీసులు ముఠాలో గల కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఏడుగురు ముఠా సభ్యులు ఉండగా మరో 8 మంది సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు లోవరాజు నాగేశ్వరరావు వద్ద గాజువాక పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసినట్లు ఎసిపి రామ్మోహనరావు తెలిపారు.