ఆంధ్రప్రదేశ్‌

టూరిజం హబ్‌గా పులికాట్, నేలపట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 27: పులికాట్, నేలపట్టు ప్రాంతాలను టూరిజం హబ్‌గా చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలసి స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఫ్లెమింగో బెలూన్ ఎగురవేసి పండుగను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ,ప్రైవేట్ స్టాల్స్‌ను ప్రారంభించి వాటిని తిలకించారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే జిల్లాలో పర్యాటక వనరులున్నందున వాటిని వినియోగించుకొనేందుకు ఇలాంటి పండుగలు నిర్వహించేందుకు నిధులు కేటాయించి తద్వారా అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమం పేరుతోనే ముందుకు సాగుతోందని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఇవే కాకుండా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించామని దీంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. పులికాట్ నేలపట్టు అభివృద్ధికి రూ.26కోట్లు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.

చిత్రం..సూళ్లూరుపేటలో ఫ్లెమింగో పక్షుల పండగను ప్రారంభిస్తున్న రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు