ఆంధ్రప్రదేశ్‌

బాబుతో జైకా బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 27: రాజధాని అమరావతిలో ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు వచ్చిన జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజన్సీ (జైకా) బృందం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమయ్యారు. రవాణా, ట్రాఫిక్ రంగ అధ్యయనానికి సంబంధించి ఒప్పందం చేసుకునేందుకు జైకా దక్షిణాసియా విభాగం డైరెక్టర్ ఇనాడ కియోసుకి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షిన్యా ఎజిమా నేతృత్వంలో ఒక బృందం ఇక్కడకు వచ్చింది. ఈ సందర్భంగా జైకా ప్రతినిధులతో సిఎం మాట్లాడుతూ జపాన్ కంపెనీలతో పని చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో అపార జలవనరులు, మిగులు విద్యుత్ ఉందని తెలిపారు. కష్టించి పని చేసే మానవ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమన్నారు. రాజధాని నగరంలో పెట్టుబడులు పెట్టడంవల్ల ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని వివరించారు. జపాన్ దేశంతో సాంస్కృతిక సంబంధాలు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో బౌద్ధం విస్తరించడం అమరావతి కేంద్రంగా జరిగిందని గుర్తుచేశారు. వచ్చే సంవత్సరం అమరావతిలో కాలచక్ర ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జపాన్ దేశ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాలని కోరారు.
ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్‌లో తలెత్తిన పరిస్థితులు అమరావతి నగరంలో పునరావృతం కాకుండా రైల్వే లైన్ వెంట సబర్బన్ ప్రాంతాల అభివృద్ధి చేపట్టాలని జైకా బృందం సూచించింది. ఈ సమావేశంలో సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీ్ధర్, జైకా ప్రతినిధులు సంజీవ్ మొహోల్కర్, టి. టాంగే తదితరులు ఉన్నారు. అనంతరం జైకా ప్రతినిధులను ముఖ్యమంత్రి సత్కరించారు.

చిత్రం..జపాన్ బృందంతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు