ఆంధ్రప్రదేశ్‌

వీరప్పన్ అనుచరుడు అస్లాంఖాన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 27: గంధంచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరుడు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అస్లాంఖాన్ (56) కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం గుండల దేవరగుట్టల వద్ద స్కార్పియోలో వెళ్తున్న అస్లాంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కడపలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి.సత్యయేసుబాబు మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం అనేకల్ తాలూకా అడగర కలహళ్లి గ్రామానికి చెందిన అస్లాంఖాన్ ఆంధ్ర, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని ఎర్రచందనాన్ని యధేచ్చగా విక్రయిస్తున్నాడన్నారు. ఇతనిపై కడప జిల్లాలో 18 కేసులు ఉన్నాయన్నారు. కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ల అన్సర్‌ఖాన్‌తో కలిసి అస్లాంఖాన్ వ్యాపారం చేసేవాడన్నారు. తిరుపత్తూరు, హుతుంగేరే, వనంబాడి, అంచేట్టి తదితర గ్రామాల నుంచి చందనాన్ని వీర్పప్పన్ సేకరించి అన్సర్‌ఖాన్‌కు విక్రయించేవాడన్నారు. 1990-95 మధ్యకాలంలో సజ్జాపూర్ పోలీసుస్టేషన్, బెంగళూరు రూరల్ జిల్లాలో ఇతనిపై ఐదు కేసులు నమోదయ్యాయన్నారు. చందనపు దుంగలను కర్నాటకలోని కటిగనహళ్లికి చెందిన రియాజ్, మెడిమల్ సంద్రాగ్రామానికి చెందిన గఫార్‌కు విక్రయించేవాడన్నారు. ఆ తరువాత చందనం దుంగల కొరత కారణంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌వైపు మళ్లాడన్నారు. ఇతని కుమారులు అర్షద్‌ఖాన్, ఆసిఫ్‌ఖాన్ స్మగ్లింగ్‌లో సహకరించేవారని వివరించారు. 2013లో కర్నాటకలోని సజ్జాపూర్ పోలీసులు, ఇతనితోపాటు కుమారుడు అర్షద్‌ఖాన్‌ను ఎర్రచందనం దుంగల అక్రమరవాణాకేసులో రిమాండ్‌కు పంపారన్నారు. ప్రస్తుతం ఈ కేసు అనేకల్ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. అస్లాంఖాన్‌కు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. 2014లో స్వగ్రామమైన అడగరకలహళ్లి గ్రామంలో తనిఖీకి వెళ్లిన చిత్తూరు పోలీసులపై అనుచరులతో కలిసి దాడి చేశాడన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 టన్నుల చందనం దుంగలు, 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేశారన్నారు. ఇటీవల పలువురు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేసి విచారించగా అస్లాంఖాన్ పేరు బయటకు వచ్చిందన్నారు. అప్పటి నుంచి అస్లాంఖాన్‌కోసం గాలింపు తీవ్రతరం చేశామన్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం గొల్లపల్లె, నడింపల్లె సమీపంలోని గుండల దేవరగుట్టల వద్ద మాటువేసి అస్లాంఖాన్‌ను అరెస్టు చేశామన్నారు. స్కార్పియో వాహనంలో వచ్చిన మరికొంత మంది పోలీసులపై రాళ్లురువ్వుతూ పరారయ్యారన్నారు. వారికోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం..పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ అస్లాంఖాన్