ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగ విజయం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోడానికి ఆయన అష్టకష్టాలు పడుతున్నారు. విభజన తరువాత కేంద్రం ఆదుకుంటుంది అని అనుకున్నారు. కేంద్రంతో ఎంత సన్నిహితంగా మెలగాలనుకున్నా, అనేక అంశాలు బాబు, మోదీల మధ్య అగాధాన్ని పెంచేస్తున్నాయి. దీంతో రాష్ట్రం లోటు బడ్జెట్‌లో కూరుకుపోయింది. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా, ఇంటికి ఒక ఉద్యోగం హామీని అమలు చేయలేదని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు చురకలు వేస్తోంది. నిరుద్యోగుల్లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల అసహనం పెరిగిపోతోంది. దీన్ని గమనించి చంద్రబాబు ఒకేసారి రాష్ట్రంలో 20 వేల పోస్ట్‌లు భర్తీ చేస్తామని ప్రకటించారు. శనివారం జరిగిన కేబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్ట్‌ల భర్తీ అంత సులభం కాదని, దీని వెనుక అనేక తికమకలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలే చెపుతున్నారు.
2014 డిఎస్సీ అభ్యర్థులకే దిక్కులేదు!
2014 డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను 2014 డిసెంబర్‌లోనే ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవలసి ఉంది. కానీ కోర్టు కేసులను సాకుగా చూపి, డిఎస్సీ అభ్యర్థులను ప్రభుత్వం అయోమయంలో పడేసింది. ఫిబ్రవరిలో కోర్టు కేసులన్నీ క్లియర్ అవడంతో, మార్చిలో పోస్టింగ్‌లు ఇస్తారని అభ్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు జూన్ ఒకటో తేదీ వరకూ పోస్టింగ్‌లు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అంటే ఏడు నెలల నుంచి డిఎస్సీ అభ్యర్థులను విధుల్లో చేర్చుకోకుండా ఖాళీగా ఉంచడం వెనుక ఆంతర్యమేంటంటే, ఒక్కసారిగా 15 వేల మందికి జీతాలు ఇవ్వాలంటే ఖజానాపై భరించలేని భారం పడుతుంది. దీన్ని భరించలేక డిఎస్సీ అభ్యర్థులను పక్కన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లోని 4వేల మంది టీచింగ్ స్ట్ఫాను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత రాష్ట్రంలో అన్ని వర్శిటీల విసిలతో మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఉద్యోగుల నియామకాలను అన్ని యూనివర్శిటీలకు ఒకే మాదిరి చేపట్టడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు. దీంతో త్రిసభ్య కమిటీని నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది.
ఇప్పటికే గ్రూప్-1,2,3,4 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు వేలాదిగా ఉన్నారు. వీరిని ఎపిపిఎస్‌ఇ రిక్రూట్ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపిపిఎస్సీకి పూర్తి స్థాయి బోర్డు రాలేదు. చైర్మన్, కార్యదర్శితోపాటు, మరో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ బోర్డులో తొమ్మిది మంది సభ్యులు ఉండాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ బోర్డులో సభ్యులను భర్తీ చేయలేదు. పూర్తి స్థాయి బోర్డు లేకుండా వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులను ఏ విధంగా నియమిస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భర్తీలో ‘ఔట్ సోర్సింగ్’ భాగమా?
ఈమధ్య చంద్రబాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ అవసరం మేరకు మాత్రమే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ 20 వేల పోస్టుల్లో చాలా వరకూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మెజార్టీ ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ నుంచి భర్తీ చేయచ్చని తెలుస్తోంది.