ఆంధ్రప్రదేశ్‌

ఉత్సాహంగా పక్షుల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట/దొరవారిసత్రం/తడ, డిసెంబర్ 28: నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఫ్లెమింగో పక్షుల పండగ ఉత్సాహంగా రెండోరోజూ కొనసాగింది. సూళ్లూరుపేట,తడలోని పులికాట్ తీరం, దొరవారిసత్రం మండలం నేలపట్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎక్కడ చూసినా సందర్శకుల సందడి కన్పించింది. సూళ్లూరుపేట వేదికగా జరుగుతున్న పక్షుల పండుగరెండో రోజు ఊపందుకొంది. పండుగ జరుగుతున్న జూనియర్ కళాశాల మైదానం సందర్శకులతో కళకళలాడింది. పట్టణంలో అన్ని ప్రాంతాలు పక్షి ప్రేమికులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే జూనియన్ కళాశాల ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించేందుకు విద్యార్థులు,ప్రజలు బారులు తీరారు. అధికారులు సందర్శకుల సంఖ్య పెరిగే కొద్ధి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరిని క్యూలైన్ల ద్వారా స్టాల్స్‌ను తిలకించే విధంగా చర్యలు తీసుకొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి అధికంగా పర్యాటకులు విచ్చేశారు. ముందుగా వారు పక్షుల పండుగ జరిగే మైదానాన్ని తిలకించి అక్కడ నుండి పులికాట్, నేలపట్టు,బివిపాలెం పడవల రేవు వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు జనాలతో కిక్కిరిశాయి. పులికాట్ తీరం సందర్శకులతో పులకించిపోయింది. షార్ సందర్శనకు విద్యార్థులు అధికంగా విచ్చేయడంతో షార్ అధికారులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. శ్రీహరికోట ప్రధాన గేటు వద్ద నుండి షార్ బస్సుల ద్వారా సందర్శనకు వచ్చే వారిని తీసుకెళ్లి ప్రయోగ వేదికలు, ఎంసిసి భవన్‌లు చూపించారు. సాయంత్రం నుండి మైదానానికి జనాలు తాకిడి ఎక్కువైంది. జిల్లాలోని వివిధ విద్యాసంస్థలనుంచి విద్యార్థులు అధికంగా విచ్చేయడంతో మైదానంలో సందడి కన్పించింది. పట్టణం మొత్తం జనాలతో కిక్కిరిసి పోవడంతో పేటకు ముందే సంక్రాంతి పండుగ కళ వచ్చినట్లు కన్పించింది. సాయంత్రం నుండే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. రెండో రోజు కావడంతో పండుగ ఊపందుకోవడంతో సందర్శకులకు కావాల్సిన తాగునీరుతో పాటు తదితర వసతులు కల్పించారు.

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరి

ఏపిలో పెట్టుబడులను
అడ్డుకునేందుకే దుష్ప్రచారం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 28: లోటు బడ్జెట్‌ను కూడా అధిగమించి ప్రైవేటు, పబ్లిక్ రంగంలో గత రెండున్నరేళ్లలో 3.5లక్షల ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఐటి రంగంలో, పరిశ్రమల్లో వీరికి అదనంగా ఉపాధి లభించింది. ఇంత పెద్దఎత్తున ఉపాధి కల్పించిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. రూ. 1.43,750 కోట్ల పెట్టుబడులతో 229 పరిశ్రమలతో 2,25,000 మంది ఉపాధి లభించిందని మంత్రులు అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో 1.30 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించబడిందని అయినా వైకాపా నేతలు మాత్రం ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని మాట్లాడటం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (కేంద్ర పరిశ్రమల శాఖ నివేదిక)లో ఏపి దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, 15.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే మొదటి స్థానం సాధించిందని ఆర్‌బిఐ ప్రకటించిందన్నారు.