ఆంధ్రప్రదేశ్‌

ఆర్డినెన్స్‌కు బాబు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: భూముల డబుల్ రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(బి)ని సవరించడానికి విధాన మండలి ఆమోదం తీసుకోవలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. చట్ట సవరణకు కౌన్సిల్ ఆమోదం లభించాలంటే ఆగస్ట్ వరకూ వేచి చూడాలని, ఈలోగా ఆర్డినెన్స్ ఇవ్వవచ్చని కేఇ ప్రతిపాదించారు. అందుకు సిఎం అంగీకరించలేదు. చట్ట సవరణకు రాష్టప్రతి ఆమోదం కూడా అవసరమైనందువల్ల కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని సిఎం అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రస్తుతం డబుల్ రిజిస్ట్రేషన్ల విషయం ఆయా సబ్ రిజిస్ట్రార్లకు తెలిసినా, రిజిస్ట్రేషన్లను నిలిపే అధికారం వారికి లేదని కెఇ కృష్ణమూర్తి ముఖ్యమంత్రికి వివరించారు. కౌన్సిల్ ఆమోదం లభించే వరకూ డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా వీలైంత వరకూ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు, కృష్ణమూర్తికి సూచించారు. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, వీటిని నిరోధించే బాధ్యత తాత్కాలికంగా సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో నెలకొల్పుదామని మంత్రి కృష్ణమూర్తి చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. అమరావతిలోనే కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నామని, ముఖ్యమైన రెవెన్యూ కార్యాలయాన్ని కూడా అక్కడే నిర్మిస్తే బాగుంటుందని ఆయన నచ్చ చెప్పారు.
100 గజాల స్థలాన్ని పేదలకు ఉచితంగా ఇచ్చే ప్రక్రియ 75 శాతం వరకూ పూర్తయిందని మంత్రి కృష్ణమూర్తి ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణమూర్తి నియోజకవర్గమైన పత్తికొండలో 100 కోట్ల రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ఇరిగేషన్ శాఖ అధికారులు వేగంగా నిర్మించడం లేదని, త్వరితగతిన ఆ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పత్తికొండలో పిజి కాలేజీ కావాలని కూడా కృష్ణమూర్తి సిఎంను కోరారు.