ఆంధ్రప్రదేశ్‌

నీటి సంరక్షణపై కేంద్రం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 29: నీటి సంరక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి పేర్కొన్నారు. గురువారం విశాఖలో రాష్టస్థ్రాయి నీటి పొదుపుమిషన్‌పై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య ప్రసంగం చేశారు. దేశంలో సాగులో ఉన్న 141 మిలియన్ హెక్టార్ల భూమిలో కేవలం 65 మిలియన్ హెక్టార్ల భూమికి మాత్రమే సాగునీటి వసతులు ఉన్నాయని, మిగిలినవన్నీ వర్షాధార భూములేనన్నారు. ఆ భూములు అన్నింటికీ రానున్న ఐదేళ్ళలో పనులు అనుసంధానంతో ప్రధాన మంత్రి క్రిషి సంచాయి యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రధానమంత్రి క్రిషి సంచాయి యోజన కింద జిల్లా సాగునీటి ప్రణాళికలను వచ్చే ఏడాది జనవరి మాసాంతానికల్లా రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. తెలివిగా, వ్యూహాత్మక ఆలోచనలు చేస్తూ పెద్దఎత్తున ఉపాధి హామీ పనుల అనుసంధానంతో ఈ ప్రణాళికలు రూపొందించి అమలుపరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ఎక్కువ విస్తీర్ణంలో భూములకు సాగునీరు అందజేసే అవకాశాలు ఏర్పడతాయన్నారు. దేశవ్యాప్తంగా సాగునీటి వసతుల్లేని జిల్లాలు 112 ఉన్నాయని, అందులో అనంతపురం జిల్లా ఒకటిగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న బ్లాక్‌లు 1,068 ఉండగా ఇందులో క్లిష్టమైన బ్లాక్‌లు 217 ఉన్నాయన్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న బ్లాక్‌లు 41, క్లిష్టమైన బ్లాక్‌లు ఏడు ఉన్నాయన్నారు. భూగర్భ జలాల సమస్య మరింత జటిలం కాకుండా ప్రతి వర్షపు నీటిబొట్టును సద్వినియోగం చేసుకుంటూ సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రణాళికలను రూపొందించాలన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని భూగర్భ జలాలు, సాగునీటి వనరుల అభివృద్ధికి అనంతపురం జిల్లా రూపొందించిన ప్రణాళిక బాగుందన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆమె సూచించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు చేపడతామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆమె కితాబునిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ప్లానింగ్ బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న కొన్ని సమస్యల వల్ల అమలులో ఇంకా కొంత వెనకబడి ఉన్నామన్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ఐఇసి, యాక్టివిటీ, ఇంటర్‌స్టేట్, డిస్ట్రిక్టు ఎక్స్‌ఫోజర్ టూర్లను నిరహించాల్సిన అవసరం ఉందన్నారు.

చిత్రం..ప్రణాళికా రచనలను విడుదల చేస్తున్న కలెక్టర్లు, సంయుక్త కార్యదర్శి అపరాజితా