ఆంధ్రప్రదేశ్‌

మార్పులేనిదే అభివృద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 29: కొత్త సంవత్సరంలో కొత్తమార్పుకు నాంది పలకాలని, మార్పు లేనిదే అభివృద్ధిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం తన నివాసం నుంచి నగదు రహిత లావాదేవీలు, జన్మభూమిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిజికల్ కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీకి, మొబైల్ కరెన్సీకి దేశం మారుతోందని, ఈ మార్పును అందరూ అందిపచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన డిజిటల్ కరెన్సీపై ఉప సంఘం సమావేశం వివరాలను తెలియజేశారు. కనిష్ట నగదుతో గరిష్ట లావాదేవీలు జరగాలని, ఆధార్ చెల్లింపులు, ఫ్యూచర్ ఫోన్, కార్డు స్వైపింగ్, కనీస నగదు వినియోగమే తక్షణ పరిష్కారంగా ఉప సంఘం అభిప్రాయపడిందన్నారు. త్వరలోనే మధ్యంతర నివేదికను ప్రధానికి అందజేయనున్నట్లు తెలిపారు. భౌతిక నగదుకన్నా డిజిటల్ కరెన్సీ ద్వారానే పారదర్శకత వస్తుందని, అవినీతి తగ్గుతుందని, ఉపాధి పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి మరింతగా ప్రోత్సాహకాలు పెరగాలన్నారు.
బ్యాంకర్ల పనితీరు అద్భుతం
తీవ్ర ఒత్తిడి నడుమ బ్యాంకర్లు పని చేస్తున్నారని, వారికి అధికార యంత్రాంగం, ప్రజలు అందరూ సహకరించాలని చంద్రబాబు సూచించారు. తక్కువ వ్యవధిలో బ్యాంకర్లు అద్భుత పనితీరు కనబరచారని, అందుకు వారిని అభినందించాలని కోరారు. పెన్షన్ల చెల్లింపులు, రైతుల చెల్లింపులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ వారంలో ఆన్‌లైన్ లావాదేవీల సగటు 23 శాతం ఉందంటూ దీనిని మార్చి నాటికి 50 శాతం తీసుకెళ్లాలన్నారు. మొబైల్ మరియు డిజిటల్ రావాదేవీలు 70 శాతానికి చేరితే మన రాష్ట్రం గిన్నీస్ రికార్డ్ పొందుతుందన్నారు. పోస్ మిషన్ల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో కృష్ణాజిల్లా దేశానికే మార్గదర్శకం అయ్యిందని గుర్తు చేస్తూ ఇదే స్ఫూర్తితో విజయవాడ నగరం మొత్తం నగదు రహితంగా మారాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామం, విజయనగరం జిల్లా ధర్మసాగరం గ్రామం స్ఫూర్తిగా ప్రతి గ్రామం నగదు రహితంగా రూపొందాలని ఆకాంక్షించారు. ఆర్బీ ఐ ప్రతినిధి సుబ్బయ్య మాట్లాడుతూ బుధవారం రూ. 2650 కోట్ల నగదు బ్యాంకులకు పంపిణీ చేశామని, ఇవన్నీ రూ. 500 నోట్లేనని చెప్పారు. ఇందులో 20 శాతం రూ. 500 కోట్లు పింఛన్ల పంపిణీకి కేటాయించినట్లు తెలిపారు. గురు, శుక్రవారాల్లో మరో రూ. 2వేల కోట్లు నగదు రాష్ట్రానికి రానుందని వివరించారు. నాబార్డు నుంచి రానున్న మొబైల్ వ్యాన్‌ను గ్రామాల్లో నగదు చెల్లింపులకు వినియోగిస్తామన్నారు.
ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ రంగనాథ్ మాట్లాడుతూ మైక్రో ఏటిఎం లావాదేవీలు 94వేల నుంచి లక్షా, 10 వేలకు పెరిగాయని ముఖ్యమంత్రికి తెలి పారు. మొబైల్ లావాదేవీలు లక్షా, 15వేల పైనే కొనసాగుతున్నట్లు తెలిపారు. బుధవారం కొత్తగా 17వేల జన్‌ధన్ కార్డులు అందజేశామన్నారు. ఎస్‌బిఐ ఏజిఎం చిట్టిబాబు మాట్లాడుతూ 2.36 లక్షల జన్‌ధన్ ఖాతాలను ప్రారంభించామన్నారు. ఎస్‌బిఐ ద్వా రా మొబైల్ లావాదేవీలు 31 శాతం పెరిగినట్లు చెప్పారు. డివైస్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజయవాడ నగరాన్ని నగదు రహితంగా రూపొందించటం సాధ్యమేనని కలెక్టర్ బాబు తెలిపారు.
ఫిర్యాదులన్నీ పరిష్కరించాలి
జన్మభూమిలో వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జన్మభూమిలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలన్నారు. మరో 3.5 లక్షల మందికి అదనంగా కొత్త పింఛన్లు మంజూరు చేశామని వాటిని కూడా గ్రామసభల్లో పంపిణీ చేయాలన్నారు. రెండున్నరేళ్లలో ఏ గ్రామానికి ఎంత చేశామనేది జన్మభూమిలో ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.