ఆంధ్రప్రదేశ్‌

రెండో పంటకు నీరివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 30: నాగార్జునసాగర్ కుడికాల్వ ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరివ్వటం కష్టసాధ్యమని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరందే అవకాశాలు ఉన్నాయన్నారు. సాగర్ రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున చివరి భూములకు నీరందించే వీలులేదని తేల్చిచెప్పారు. నీటి లభ్యత ఆధారంగా సాగు, తాగునీటికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సాగర్ కుడికాల్వ ఆయకట్టు పరిధిలో చివరి భూములకు నీరందటంలేదని సభ్యులు ఆందేళన చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు రెండోతడి కింద ఈ సీజన్‌కు 15 టిఎంసిల నీరు విడుదలైందని, గతంలో 13.5 టిఎంసిలు మాత్రమే అందాయని వివరించారు. మంచినీటికి, సాగునీటికి నీటిపారుదలశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే చివరి భూముల్లో పంటలు పూర్తిస్థాయిలో ఎండిపోతున్నాయని పలువురు జడ్పీటిసి, ఎంపిపిలు ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ ఎస్‌ఇ మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం గత నెల 25వ తేదీ వరకు నీటిని విడుదల చేశారని 30వ తేదీన మరికొంత నీటి విడుదలకు ప్రతిపాదనలు చేశామన్నారు. అయితే రివర్‌బోర్డులో జాప్యం కారణంగా ఈనెల 19వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఈ మేరకు ప్రస్తుతానికి 3 నుంచి 8వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసేందుకు టిఎస్ సర్కార్ అంగీకరించిందని వివరించారు. నిరంతరం నీటి విడుదల సాధ్యం కాదన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కనుక రైతులు సానుకూలంగా స్పందించాలని మంత్రి పుల్లారావు కోరారు. వర్షాధార ఆరుతడి పంటలకు నీరందుతోందని, సాగు నీరు సకాలంలో అందని ప్రాంతాలకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సాగర్ జలాల పంపిణీ వివాదం ఉన్నందునే పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతానికి నీరందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంకాగా ఇప్పటి వరకు 13లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. డాక్యుమెంటేషన్ పూర్తయిన 48 గంటల్లోనే రైతుల ఖాతాకు సొమ్ము జమ చేస్తున్నారని వివరించారు. రుణ అర్హత కార్డులు, పాస్ పుస్తకాలు లేకపోయినా సాగు ధృవపత్రాలు కలిగిన రైతుల వద్ద నుండి కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.