ఆంధ్రప్రదేశ్‌

వందశాతం స్మగ్లింగ్ ఆపలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 30: ఎర్రసంపదను పరిరక్షించాలంటే ప్రభుత్వంలోని అధికారుల అండ, అటవీశాఖ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పిస్తే ఒక్క ఎర్రచెట్టును కూడా నేలకు ఒరగినివ్వబోమని అటవీశాఖ అధికారి డిసిఎఫ్ మూర్తి చెప్పారు. టాస్క్ఫోర్స్ డిఐజిగా ఉన్న కాంతారావుకు త్వరలో ఐజిగా ఉద్యోగోన్నతి కలుగనున్న నేపధ్యంలో శుక్రవారం స్థానిక కపిలతీర్థం వద్ద ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయం వద్ద అటవీశాఖ అధికారులు విలేఖరులతో మాటా-మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా డిఐజి దగ్గర నుంచి డిసి ఎఫ్ వరకు మనసువిప్పి మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడానికి సిఎం సంకల్పించినప్పటినుంచి నేటివరకు ఉన్న పరిణామాలను వారు వివరించారు. పోలీస్, అటవీశాఖ విభాగాల్లో ఉన్న అధికారాలు, సౌకర్యాలు చట్టపరమైన విధానాలు వేర్వేరుగా ఉండటంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అయితే ఈ రెండు శాఖల సిబ్బందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడంతో అటవీసంపద పరిరక్షణలో 80శాతం విజయం సాధించామన్నారు. మరో 20శాతం సాధించడానికి అనేక సమస్యలు ఉన్నాయని అది ఎంత వరకు సాధ్యమవుతుందో కూడా చెప్పలేమని డి ఐ జి కాంతారావు తేల్చి చెప్పారు. అయితే ప్రభుత్వం అండ, అధికారుల సహకారం, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ఒక్క ఎర్రచెట్టును కూడా నేలకు ఒరిగిపోకుండా చేసే సత్తా అటవీశాఖకు ఉందని డిఎఫ్‌ఓ మూర్తి చెప్పారు. అటవీశాఖకు కనీస సౌకర్యాలు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.