ఆంధ్రప్రదేశ్‌

నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 30: ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని జనవరి 1వ తేదీన వి ఐ పిలకు, ముఖ్య అధికారులకు ప్రాధాన్యత దర్శనం టికెట్లను క్రమబద్ధీకరించి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు కేటాయించడానికి చర్యలు చేపడుతున్నట్లు జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ జనవరి 1వ తేదీన ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి 31వ తేదీన తిరుమలకు చేరే విఐపి లకు వసతి, దర్శనం కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మంత్రులు తదితర వి ఐ పిలు స్వయంగా వస్తే వారితోపాటు మరో ఐదుగురికి అనుమతిస్తామన్నారు. ఇందుకు సంబంధించి పద్మావతి నగర్ ప్రాంతంలోని విచారణ కార్యాలయం సమీపంలోవున్న సీతానిలయం, రామరాజ్ నిలయం వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఉన్నతాధికారులు ఎవరైనా వస్తే వారితోపాటు మరో ముగ్గురికి ప్రాధాన్యత దర్శనం టికెట్లు, వసతిని కల్పిస్తామన్నారు. వారికి సన్నిధానం వద్ద సిబ్బంది ఏర్పాటుచేసి కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాజ్యాంగ పరంగా ప్రముఖులైనవారికి తామే స్వయంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు వెంకటకళా నిలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జనవరి ఒకటవ తేదీన తెల్లవారుజామున 1.30గంటలకు ప్రారంభమై, రెండుగంటలు మించకుండా దర్శనం పూర్తి చేస్తామన్నారు.
తెల్లవారు జామున మూడున్నర గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. 1వ తేదీన దర్శనం చేసుకోవాలని 31వ తేదీ ఉదయం నుంచి తిరుమల్లో ఉంటున్న సామాన్యభక్తులకు వైకుంఠం-2లో అనుమతించి వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జె ఇ ఓ వివరించారు. దివ్యదర్శనం భక్తులకు యధావిధిగా దర్శన ఏర్పాట్లు ఉంటాయన్నారు. 31వ తేదీ, 1వ తేదీన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు.