ఆంధ్రప్రదేశ్‌

అమరావతి అభివృద్ధి సంస్థ పేరిటే కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమికను పోషిస్తూ వస్తున్న రాజధాని నగర అభివృద్ధి మరియు నిర్వహణ సంస్థ ‘సిసిడిఎంసి’ శుక్రవారం నుంచి అమరావతి అభివృద్ధి సంస్థ ‘ఏడిసి’గా తన కార్యకలాపాలను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సూచన మేరకు ఈ మార్పు జరిగినట్లు ఏడిసి చైర్‌పర్సన్ డి.లక్ష్మీపార్థసారధి, సంస్థ కార్యదర్శి జె.వీర్రాజులు ఈ మేర ఓ ప్రకటనలో అధికారికంగా ప్రకటించారు. ఇకపై తమ సంస్థ చేపట్టే కార్యకలాపాలన్నీ అమరావతి అభివృద్ధి సంస్థ పేరుతోనే జరుగుతాయని వారు స్పష్టం చేశారు.
వెలవెలబోయిన సచివాలయం
పోలవరం స్పిల్ వే కాంక్రీటు పనుల ప్రారంభం నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సందర్శకులు లేక వెలవెలబోయింది. మంత్రులందరూ పోలవరం వెళ్లడంతో సచివాలయానికి ఎవరూ రాలేదు. అధికారులు కూడా తక్కువ సంఖ్యలో వచ్చారు. ప్రతి శుక్రవారం సచివాలయంలో గ్రీవెన్సు డే నిర్వహించడం తెలిసిందే. మంత్రులు ఉండరని ముందుగానే తెలియడంతో సందర్శకుల తాకిడి లేదు.