ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 30: ఏపిపిఎస్‌సి ద్వారా 4వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అన్ని విభాగాల్లో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అర్హులైనవారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ఏపిపిఎస్‌సి చైర్మన్ పిన్నమనేని భాస్కర్ వెల్లడించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా ఆయన గురువారం తిరుమలకు చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఏపిపిఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలు, ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది,కొత్త సంవత్సరంలో నిర్వహించే పరీక్షలను పగడ్బందీగా నిర్వహించే విషయాన్ని వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజినీర్లకు సంబంధించి 748 పోస్టులకు నోటిఫికేషన్‌లు విడుదల చేశామన్నారు. ఏ ఇలతోపాటు ఆరు రకాల సివిల్ పోస్టులకు 256 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గ్రూప్ 2లో 942 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. నాలుగు రోజులు క్రితం వివిధ రకాల 361 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. డిగ్రీస్థాయిలో 611 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. శనివారం మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వీరందరికి 6 నుంచి 9 నెలలోపు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిఫారుసు చేస్తామన్నారు. ఏ ఇ పోస్టులకు సంబంధించి ప్రధాన పరీక్షలు జరుగుతున్నాయని, అర్హులైనవారికి జనవరిలో ఉద్యోగాలు వస్తాయన్నారు. పరీక్షలు రాసేటప్పుడు ఎమ్మార్ షీట్‌తోపాటు ఒక కార్బన్ పేపర్‌తో డూప్లికేట్ ఎమ్మార్ షీట్‌ను ఇస్తామన్నారు. తద్వారా పరీక్ష రాసే అభ్యర్థి ఎమ్మార్ షీట్‌లో ప్రశ్నకు రాసే సమాధానాలు తన వద్ద ప్రతి కూడా ఉంటుందన్నారు.