ఆంధ్రప్రదేశ్‌

పురుషోత్తపట్నం ఎత్తిపోతల డిపిఆర్ లేకుండానే శంకుస్థాపనకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 31: అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద రూపొందించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి డి పి ఆర్ లేకుండానే శంకుస్థాపనకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏ ప్రాజెక్టు అయినా డిపిఆర్ లేకుండా చేపట్టడానికి వీల్లేదు. సాంకేతికంగా కూడా అది చెల్లదు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం పోలవరంలో అంతర్భాగమని చెప్పినప్పటికీ డిపిఆర్‌లో ఆ మేరకు లేదనే ఉద్ధేశ్యంతో పోలవరంతోపాటే ఆ పథకానికి కేంద్రం నిధులు ఇచ్చేదనే వాదన ఉంది. అయితే పోలవరం ప్రధాన కాలువలు సిద్ధంగా వున్నాయి కాబట్టి వాటిని సత్వరం సద్వినియోగం చేసుకునేందుకు తెలుగుదేశంపార్టీ అధికారంలోకొచ్చిన కొద్ది రోజులకే ఈ పథకాన్ని ఆలోచన చేసి చేపట్టింది. అయితే పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమని చెప్పి నిధులు రాబట్టేందుకు ప్రయత్నించినప్పటికీ పోలవరం అధారిటీ అంగీకరించకపోవడంతో ఎట్టకేలకు ఏదోవిధంగా నిధుల కోసం కసరత్తు చేసి పూర్తి చేశారు. దీనికి తోడు ఈ విధమైన ప్రాజెక్టులో నదుల అనుసంధానం అనే పేరు కూడా సాంకేతికంగా చెల్లదని అంటున్నారు. ఎత్తిపోతల పధకం ద్వారా నదుల అనుసంధానం అనేది చెల్లదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇపుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంద్వారా కూడా నదుల అనుసంధానమేననే వాదన మొదలెట్టింది. ఉత్తరాంధ్రలో నదులతో అనుసంధానం చేయడం ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా నదుల అనుసంధానానికి ఆలంభనగానే వాదనకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ అవసరాలకు నీటిని ఇవ్వడానికి, ఎడమ ప్రధాన కాలువ ద్వారా పారిశ్రామిక అవసరాలకు, పెట్రో కారిడార్‌కు నీటి వనరులు కల్పించేందుకు ప్రధాన ఉద్ధేశ్యంగా పురుషోత్తపట్నం రూపకల్పన జరిగిందంటున్నారు.