ఆంధ్రప్రదేశ్‌

పండగలా జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 31: జన్మభూమి-మావూరు కార్యక్రమం ఓ పండగలా నిర్వహించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు. మీ విజ్ఞానాన్ని, అనుభవాలను, శ్రద్ధను దత్తత గ్రామాల అభివృద్ధిపై పెట్టాలి. మీ కుటుంబంపై, వృత్తిపై పెట్టే శ్రద్ధలో కొంతభాగం గ్రామాల అభివృద్ధిపై పెట్టాలి’ అన్నారు. జనవరి 2 నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ‘స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు’ పార్టనర్ల (్భగస్వాముల)తో శనివారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మనందరం గ్రామాల నుంచే వచ్చాం, సామాన్య కుటుంబంలో పుట్టి స్వయంకృషితో, అచంచల విశ్వాసంతో ఈ స్థాయికి వచ్చాం. మనతో పుట్టినవారు, ఇంకా అదే గ్రామాల్లో నివసించేవారు, కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మనం ఎంత పెద్దవాళ్లమైనా మన మూలాలు గ్రామాల్లోనే వుంటాయనేది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. మన భవిష్యత్తుకు, మన ప్రస్తుత అవకాశాలకు మూలాలైన గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అందరూ తోడ్పడాలన్నారు. ‘మీ విజ్ఞానాన్ని, అనుభవాలను వినియోగించండి, మీ స్వగ్రామాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మనకున్న మానవ సంబంధాలు మరే దేశంలో లేవంటూ, మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా పేర్కొన్నారు. స్వయంకృషితో పైకొచ్చిన మీరంటే మీ గ్రామంలో ఎంతో ప్రేమ, గౌరవం ఉంటాయంటూ, స్వగ్రామాల అభివృద్ధితో ఆ గౌరవాన్ని చిరస్థాయిగా నిలబెట్టుకోవాలన్నారు. ఈరోజు మనవాళ్లు ప్రపంచం అంతా వెళ్లారు, రేపు ప్రపంచం మొత్తం మనవద్దకు రావాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ‘జన్మభూమి కూడా ఒక పండగ లాంటిది, సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్లినట్లే జన్మభూమికి కూడా అందరూ స్వస్థలాలకు వెళ్లాలి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ప్రగతి ప్రాతిపదికన గ్రామాలకు రేటింగ్ ఇస్తున్నాం. మీ గ్రామాలకు మంచి రేటింగ్ వచ్చేలా మీరంతా తోడ్పాటు ఇవ్వాలి’ అని స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు భాగస్వాముల (పార్టనర్ల)కు విజ్ఞప్తి చేశారు. ‘మీ విజ్ఞానం రాష్ట్రానికి అవసరం, మీ అనుభవం ప్రజలకు అవసరమని’ ముఖ్యమంత్రి తెలిపారు. రొటీన్‌గా పనిచేస్తే ఫలితాలు కూడా రొటీన్‌గానే ఉంటాయంటూ, వినూత్న ఆలోచనలతోనే వినూత్న ఫలితాలను సాధించగలమన్నారు. స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు కార్యక్రమంపై ఇప్పటికే ఒక వెబ్‌సైట్ పెట్టామని, ఫేస్‌బుక్ ఉందని, పార్ట్‌నర్ హెల్ప్‌లైన్ నెంబర్ 918008984791 కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ప్రవాస గ్రామీణులు (ఎన్నార్వీలు) పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు సింగపూర్, దుబాయ్ ఏ స్థాయిలో ఉండేవి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాయో గమనంలోకి తీసుకోవాలని మానవుడు తలుచుకుంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చనే దానికి ఇవే తార్కాణాలుగా వివరించారు. ‘ప్రతిరోజూ 5 నిమిషాలు మీ గ్రామం గురించి ఆలోచించండి, అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీ విజ్ఞానం, అనుభవం రాష్ట్రానికి అవసరం, మీ స్వగ్రామానికి అవసరం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్ధేశం చేసారు. మీలో కొంతమంది కుటుంబం కోసం ఇన్నాళ్లు శ్రమించారని, కొంతమంది బంధువులను పైకి తెచ్చారని అంటూ ప్రస్తుతం గ్రామాభివృద్ధికి నడుం కట్టాల్సిన తరుణం వచ్చిందన్నారు. జీవితంలో ఒక స్థాయికి వచ్చేవరకు జీవనోపాధి కోసం కష్టపడతామని, ఆ తరువాత గుర్తింపు కోసం ఆరాటపడతామని, గ్రామాభివృద్ధికి పాటుబడితే లభించేది అంతా ఇంతా గుర్తింపు కాదని తెలిపారు. జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న జన్మభూమిలో ఎన్నారైలు, ఎన్నార్వీలు భాగస్వాములు కావాలన్నారు. మన జనాభాలో యువత అత్యధికంగా ఉండటం అభివృద్ధికి ఎంతగానో కలిసివచ్చే అంశం అన్నారు.