ఆంధ్రప్రదేశ్‌

18వ శతాబ్దానికి చెందిన పంచలోహ విగ్రహలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 4: 18వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్న పంచలోహ విగ్రహాలను సోమవారం కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 10 లక్షలు వుంటుంది. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ విలేఖరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని నిర్మల్‌నగర్‌లో లక్ష్మీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో పంచలోహ విగ్రహాలు విక్రయిస్తున్నట్లు 4వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందటంతో దాడి చేసి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి 14 అంగుళాల నాగ దేవత, 6 అంగుళాల కలిగిన శివుడి విగ్రహాలు, ఇత్తడి మూత, ఒక సంచిని స్వాధీనం చేసుకున్నారు. సిఐ నాగరాజారావు, సిబ్బందితో కలిసి చేసిన దాడిలో ఆదోని పట్టణానికి చెందిన బోయ ఉరకుందప్ప, బోయ ఈరన్న, షేక్ మహబూబ్‌బాషా, సయ్యద్‌తాహీర్‌తో పాటు కర్నూలు నగరానికి చెందిన మహమ్మద్ షరీఫ్, షేక్‌అలీ, నవాబ్‌పేట అల్లబకాష్‌ను అదుపులో తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. వీరంతా ముఠాగా ఏర్పడి పురాతన దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ దొరికిన వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇక నిందితులను అరెస్టు చేసిన సిఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేస్తామని ఎస్పీ తెలిపారు.