రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో నూతన సంవత్సర శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 1: నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన వెల్లువయ్యేలా అడుగడుగునా తిరుమల భక్తులకు కలియుగ వైకుంఠంగా దర్శనమిచ్చింది. ఆదివారం జనవరి 1, ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు పోటెత్తాయి. ఆలయం ముందు భాగాన ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి ఫ్లెక్సీ, అరటిబోదెలు, మామిడితోరణాలు, బంతిపూల మాలలు ప్రత్యేక అలంకరణగా నిలిచాయి. ఇక ఆలయంలోకి అడుగుపెట్టిన వారికి ఆలయం నుంచి వెలుపలికి రావాలంటే మనస్కరించని రీతిలో ఆలయం లో పుష్పాలంకరణ చేశారు. పగలుకన్నా రాత్రిపూట విద్యుద్దీపకాంతుల నడుమ శ్రీవారి ఆలయం అద్భుతమైన కాంతులు విరజిమ్ముతూ భక్తులను కట్టిపడేసింది. ఇదిలావుండగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల ఫలితంగా నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సామాన్య భక్తులు సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకున్నారని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలో ఆదివారం దివ్యదర్శనం కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్‌లను ఇఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇఓ మీడియాతో మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికంటే ముం దుగానే ఉదయం 2.40 గంటలకే భక్తులకు సర్వదర్శనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనవరి 8న వైకుంఠ ఏకాదశి, జనవరి 9న ద్వాదశి పర్వదినాల సందర్భంగా కూడా ఇదేరీతిలో భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు.
భక్తులతో పోటెత్తిన దుర్గమ్మ సన్నిధి
విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం సుమారు 60వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కు బడులు చెల్లించుకున్నారు.
నూతన సంవత్సరం రోజున దేవస్థానం అధికారులు ఊహించిన విధంగా ఉదయం 8గంటలనుండే అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి రావటంతో దుర్గగుడి అధికారులు భక్తులను ఘాట్‌రోడ్ ఓం టర్నింగ్ వద్దనే భక్తులను నియంత్రిస్తూ ఇక్కడే నుండే భక్తులను వివిధ క్యూమార్గాల్లో పంపి అ దర్శనం చేయించారు. 300 టిక్కెట్ కొ నుగోలు చేసిన భక్తులకు సుమారు 4 గం టలు, సర్వదర్శనానికి 6 గంటలు, రూ. 100 దర్శనానికి 3 గంటల సమ యం పట్టింది. దీనికితోడు ఆదివారం ఉదయం 8గంటలనుండే ఐపిఎస్, ఐఎఎస్, తదితరులు సుమారు 15మంది అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు.

చిత్రాలు..కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో పోటెత్తిన భక్తజనం