ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో టిడిపి వ్యతిరేక పవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 4: అధికారం సాధించిన రెండేళ్లలోనే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. చంద్రబాబు జరిపించుకున్న రహస్య సర్వేలో ఈ విషయం వెల్లడైనందునే, తమ పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలుచేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో సోమవారం పార్టీ అంతర్గత సమావేశంలో జిల్లా అధ్యక్షుని ఎన్నికకై అభిప్రాయసేకరణ జరిపారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో టిడిపికి పూర్తిగా ఓటింగ్ తగ్గిందని, 15 నియోజకవర్గాల్లో పట్టు పూర్తిగా తగ్గిందని వెల్లడయ్యిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 1991-96 మధ్య రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొందరు ఎంపిలు పార్టీని ఫిరాయించిన సందర్భంలో జరిగిన ఒక సంఘటనను ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాడు తనతో సహా తమ అధినేత ఎన్టీఆర్ మరికొందరు నేతలు రాత్రి సమయంలో ఒక ఎంపి ఇంటికి వెళ్లామని, ఆ సమయంలో సదరు ఎంపి భార్య నిలువెల్లా వణికిపోతూ కనిపించారని, ఆరాతీస్తే ఇంట్లో మంచం కింద రూ.2 కోట్ల నోట్ల కట్టల మూట ఉన్నట్టు వెల్లడయ్యిందన్నారు. ఆ రోజుల్లోనే ఒక్కొక్కరికి రూ.2 కోట్లు ఇచ్చి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి టిడిపి నేతలు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని, దాన్ని తిరస్కరించి విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచారన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంఛేశారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరిగా కెసిఆర్ కొనుగోలు చేస్తున్నారని గగ్గోలుపెట్టిన చంద్రబాబు అదే విధానాన్ని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు