ఆంధ్రప్రదేశ్‌

వేగంగా పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతుండటంపై ఖండాంతరాలలో తెలుగువారంతా గర్వపడుతున్నారని అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 ధరల ప్రకారం ఎసెస్‌మెంట్ పంపమని తెలిపిందన్నారు. ప్రాజెక్టు కాస్ట్ పెరగడానికి కారణం ముఖ్యంగా 70 శాతం నిర్వాసితులకు అందించడంతో పాటు ఇప్పటి ధరలకు అనుగుణంగా అంచనాలు వేయడం మరొక కారణమని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులు జనవరిలో చేపడతామని, గేట్ల నిర్మాణానికి కూడా పోలవరం సైట్‌లోనే చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల సీమలోని నాలుగు జిల్లాలకు నీరు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఊహించని విధంగా ప్రాజెక్టు పనులు జరుగుతుండటాన్ని చూసి దొంగలంతా ఉలిక్కిపడి లేఖల ద్వారా తమ ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారని దేవినేని చెప్పారు. ఆయన స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కెవిపి రామచంద్రరావు పోలవరం ప్రాజెక్టు పనులపై శే్వతపత్రం విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయడంపై మండిపడ్డారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం 2018 నాటికి డ్యామ్‌లో నీళ్లు నిలిపే విధంగా పనులు వేగంగా చేస్తుంటే కెవిపి రామచంద్రరావు ప్రాజెక్టు పూర్తిపై శాపనార్థాలు పెట్టడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రాజెక్టు పనులు ఏ మాత్రం చేపట్టకుండా, కాలువలు తవ్వి వేల కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. అలాంటి ప్రాజెక్టుకు వివిధ నేతల పేర్లు పెట్టి రాజకీయం చేశారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండటానికి పోలవరం 10 ముంపు గ్రామాలను సమస్యాత్మకంగా చేశారన్నారు. అలాంటిది సిఎం చంద్రబాబు అధికారం చేపట్టకముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, 10 ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపాలని ప్రధానిపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపేలా వ్యవహరించారని అన్నారు.
వైయస్ ఆత్మ కెవిపి రామచంద్రరావు పోలవరం గురించి రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అవుతుందన్నారు. కెవిపి వెనుక జగన్, సాక్షి పత్రిక, ఛానల్, ఎంపి విజయసాయిరెడ్డిలు ఉన్నారని తెలిపారు. కెవిపి రామచంద్రరావు లాంటి వాళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. పులివెందులకు నీళ్లు ఇవ్వడం చేతగాని జగన్, వైయస్‌లు చేసిన పాపాలు ఊరికినే పోవని వెంటాడతాయని తెలిపారు. 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే రకరకాల డ్రామాలు ఆడి ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014-15 సంవత్సరానికి రూ.430 కోట్లు ఖర్చు చేశామని, 2015-16లో రూ.1868 కోట్లు, 2016-17లో రూ.934.40 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇంత పారదర్శకంగా పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తుంటే, కెవిపి, జగన్‌లు విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

చిత్రం..పాత్రికేయులతో మాట్లాడుతున్న మంత్రి దేవినేని ఉమ