ఆంధ్రప్రదేశ్‌

అజో-విభొ కందాళం ఫౌండేషన్ సాహితీ సదస్సులు నేటినుంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, జనవరి 4: అప్పాజోస్యుల విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్ 24వ వార్షిక సాహితీ సాంస్కృతిక సదస్సులు గురువారం నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేటలోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించనున్నారు.
శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ మరియు కల్చరల్ అసోసియేషన్ సహకారంతో ఈనెల 8వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. సదస్సుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు, సరిలేరు నీకెవ్వరు విశిష్ట పురస్కారాలు, రంగస్థల సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాలు, వివిధ రంగాల్లో ప్రతిభామూర్తులకు జీవితకాల సాధన పురస్కారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజో-విభొ కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆహ్వాన సంఘం కన్వీనర్ ఆచార్య డిఎస్‌ఎన్ మూర్తి, ప్రొఫెసర్ టి శివప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఫౌండేషన్ సభ్యులు