ఆంధ్రప్రదేశ్‌

222 గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: శాంతి భద్రతలను పరిరక్షణకు జన్మభూమి కార్యక్రమంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమంలో నాలుగో రోజు నాటికి 222 గ్రామాలు శాంతిభద్రతల సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 306 కేసులు నమోదు చేశారు. 16 లక్షల మంది పింఛనుదారులకు 105.28 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద 4.87 లక్షల మంది వృద్ధులకు, 3.41 లక్షల మంది వితంతువులకు, 1.2 లక్షల దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 31.8 లక్షల మందికి సంక్రాంతి కానుకలు, 9.86 లక్షల మంది జీవిత, అంగవైకల్యం బీమా కింద నమోదయ్యారు. దీపం పథకంలో భాగంగా 2.76 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లను అందచేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా 94,736 గృహాలను, 8.76 లక్షల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయగా, విద్యార్థినులకు 2322 సైకిళ్లు పంపిణీ చేశారు. 6809 ఆరోగ్య శిబిరాలను నిర్వహించి, కళ్ల అద్దాలు పంపిణీ చేయాల్సిన వారి సంఖ్య 20,930గా గుర్తించారు.