ఆంధ్రప్రదేశ్‌

నౌకాయానంలో నవశకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నౌకాయాన రంగంలో నవశకానికి నాంది పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశాలకు పిలుపునిచ్చారు. సముద్ర జలాల పరిరక్షణ, భద్రత, వాణిజ్య, దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇవన్నీ సాకారం కావాలంటే నౌకాయాన విస్తరణ, పటిష్ఠపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా చివరి రోజు ఆదివారం స్థానిక ఆర్‌కె బీచ్‌లో జరిగిన నేవల్ ఆపరేషన్ డెమో, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆయన తిలకించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్‌లో ఇండో ఆఫిక్రా సదస్సు ఢిల్లీలో నిర్వహించామని, దీనికి 54 ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో జైపూర్‌లో ఇండో పసిఫిక్ ఐలెండ్ కోపరేషన్ సదస్సు నిర్వహించగా 40 దేశాల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. సార్క్ దేశాలన్నింటితో కలిపి 12వ సౌత్ ఏషియన్ క్రీడలు నిర్వహిస్తే, అందులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఏప్రిల్‌లో తొలిసారిగా గ్లోబల్ మారిటైం సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని ప్రధాని మోదీ తెలిపారు. భావ సారూప్యత కలిగిన దేశాలతో వర్తక, వాణిజ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడులను ఆహ్వానించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అజెండాగా సదస్సు సాగుతుందన్నారు. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తూర్పు తీరంలో తొలిసారిగా జరిగిన అద్భుత ఘట్టమన్నారు. దీనికి 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. తన ఆహ్వానాన్ని అందుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన దేశాలను సముద్రం ఒక కుటుంబంగా చేసిందని, అందరి మనసులను ఒక్కటి చేసిందని మోదీ అన్నారు.
2001లో పశ్చిమ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇప్పుడు విశాఖలో జరుగుతోంది. ఈ 15 ఏళ్లలో భారతలో రాజకీయంగా అనేక మార్పులు వచ్చాయి. లక్ష్యాలు, వ్యూహాలు మారాయి. ప్రపంచ దేశాలు సంపద సృష్టించడానికి పరుగులు తీస్తున్నాయి. భారత దేశ ఆర్థికాభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఇందుకు కారణం నౌకాయాన రంగాన్ని పటిష్ఠపర్చడమేనని మోదీ అన్నారు. భారత దేశంలో 90 శాతం వాణిజ్యం నౌకాయానం ద్వారానే జరుగుతోందని చెప్పారు. 15 ఏళ్ల కిందట ఆరు ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం సముద్ర మార్గం ద్వారా జరిగితే, ఇప్పుడు అది 20 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని మోదీ పేర్కొన్నారు. దేశంలోని 60 శాతం ఉత్పత్తులు సముద్ర మార్గం ద్వారానే వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.
సవాళ్లను ఎదుర్కోవాలి
ఆర్థికంగా ఎంతో మేలు చేస్తున్న నౌకాయానం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ, దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రవాదులు, సముద్రపు దొంగల రూపంలో నౌకా వాణిజ్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. సునామీలు, తుపానులు, వాతావరణ మార్పులు నిరంతరం సముద్రాల్లో అల్లకల్లోలాలు సృష్టిస్తున్నాయని అన్నారు. తాజాగా తలెత్తుతున్న అంతర్జాతీయ నౌకాయాన సవాళ్లను ఎదుర్కోవడం భారత నౌకాదళం ఒక్కదాని వలన సాధ్యం కాదంటూ పొరుగు దేశాలు కలిసి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాచార వ్యవస్థకు ఎంతగానో సహకరిస్తున్న సముద్ర గర్భంలో ఉన్న కమ్యూనికేషన్స్ లైన్స్‌ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉందని చెప్పారు. శాంతి, నమ్మకం, సుస్థిరతతో కూడిన నౌకాయాన్ని సాగించలమన్న నమ్మకం అన్ని దేశాలకు కల్పించాల్సిన బాధ్యత వివిధ దేశాలపై ఉందన్నారు. ఇంటర్నేషల్ ఫ్లీట్ రివ్యూకి హాజరైన దేశాలన్నీ ఇందుకు సంసిద్ధత తెలియచేశాయని ప్రధాని మోదీ చెప్పారు.
నా ఆశలు నెరవేర్చేది యువతే
దేశాభివృద్ధి కోసం ఎన్నో కలలు కంటున్నాను. నేను ఆశావాదిని. ఇవి యువత ద్వారానే సాధించుకోగలుతానన్న నమ్మకం నాకు ఉంది అని మోదీ చెప్పారు. దేశంలో చాలామంది యువత ఉద్యోగ, ఉపాధి కోసం పరితపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. రక్షణ రంగానికి అసరమైన యుద్ధ నౌకలు తయారు చేసే బాధ్యతను స్వదేశీ నౌకా నిర్మాణ సంస్థలకే అప్పగిస్తున్నామని చెప్పారు. తయారీ రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. భారత దేశానికి పెద్దఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. నౌకావాణిజ్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో నిపుణతతో కూడిన యువత ఆసరా తీసుకుంటామని, అందుకే స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

చిత్రం... వెలుగు దివ్వెలు విరజిమ్ముతున్న బ్లాక్ పాంథర్ విమానం

చిత్రం... ఐఎఫ్‌ఆర్ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోదీ